Deceased Candidates Win in Panchayat Elections: వారు లేరని తెలిసినా గెలిపించుకున్నారు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:52 AM
ఓటరు నాడి పట్టుకోవడం అంత ‘వీజీ’ కాదని నిరూపించే ఘటనలివి. నామినేషన్ వేసి వివిధ కారణాలతో ఎన్నికలకు ముందే ప్రాణాలు కోల్పోయిన పలువురు.....
ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థికి పట్టంకటిన ఓటరు
ప్రచారంలో గుండెపోటుతో మరణించిన అభ్యర్థికి విజయం
శంకర్‌పల్లి, రాయికోడ్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఓటరు నాడి పట్టుకోవడం అంత ‘వీజీ’ కాదని నిరూపించే ఘటనలివి. నామినేషన్ వేసి వివిధ కారణాలతో ఎన్నికలకు ముందే ప్రాణాలు కోల్పోయిన పలువురు అభ్యర్థులకు ఓటర్లు అనూహ్యంగా పట్టం కట్టారు. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థిని, ఎన్నికల ప్రచారంలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థిని తమ నాయకులుగా ఎంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామానికి చెందిన చల్కిరాజు కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. కానీ ఓటమి భయంతో ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఆదివారం జరిగిన ఎన్నికలో గ్రామంలో 1446 ఓట్లు పోలవ్వగా అందులో 699 ఓట్లు సాధించిన చల్కి రాజు 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పరిధి మంచర్లగూడ 8వ వార్డుకు మెంబర్‌గా ఎన్నికల బరిలో నిలిచిన పల్లె లత(42) ఈ నెల 7న గుండెపోటుకు గురై మరణించారు. తాజా ఫలితాల్లో పల్లె లత తన ప్రత్యర్థి అనితపై 30ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.