Bijapur Encounter: బైరంగడ్ ఎన్‌కౌంటర్.. 18కి చేరిన మృతుల సంఖ్య
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:45 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బైరంగడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 18కి చేరుకుంది....
16 మంది మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు
వీరందరిపై కోటి 12లక్షల రివార్డు: బస్తర్ ఐజీ
చర్ల/చింతూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ లోని బీజాపూర్ జిల్లా బైరంగడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 18కి చేరుకుంది. వీరిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలున్నారు. బీజాపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరో ఆరుగురు మావోయిస్టుల మృత దేహాలను కేంద్ర బలగాలు గుర్తించాయి. ఘటనా స్థలం నుంచి 19 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్బంగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ.. బైరంగడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, బలగాలు కూబింగ్ చేపట్టాయన్నారు. మృతి చెందిన మావోయిస్టులను పీఎల్‌జీఏ 2బెటాలియన్‌కు చెందిన సభ్యులుగా గుర్తించామన్నారు. ఇది పోలీసు బలగాలు సాధించిన పెద్ద విజయమని సుందర్ రాజ్ పేర్కొన్నారు. అయితే 18మందిలో 16మంది వివరాలను గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. అంతకు ముందు.. ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన జవాన్ల మృతదేహాలకు బీజాపూర్‌లో పోలీస్ ఉన్నతాధికారులు ఘన నివాళలర్పించారు.