kumaram bheem asifabad- నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:09 PM
కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు మరింత గడువు పొడిగించారు. ఈనెల 13న గడువు ముగిసింది. కాగా ఈనెల 27 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల క్రిష్ణ తెలిపారు. నవోదయాల్లో అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతుండడంతో వారు దేశం లోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
- డిసెంబర్ 13న రాత పరీక్ష
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు మరింత గడువు పొడిగించారు. ఈనెల 13న గడువు ముగిసింది. కాగా ఈనెల 27 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల క్రిష్ణ తెలిపారు. నవోదయాల్లో అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతుండడంతో వారు దేశం లోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిన నవోదయ విద్యాలయా ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశా లకు దరఖాస్తులను చేసుకొని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. అలాగే 9, 11 తరగతుల్లో కూడా ఖాళీ సీట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సీట్లకు కూడా విద్యార్థులు దరఖాస్తులు వె బ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్ సూచించారు.
- ఆరో తరగతిలో..
కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి లో 80 సీట్లు ఉన్నాయి. వీటిలో 60 సీట్లు గ్రామీణ ప్రాంతాల వారికి 20 సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థు లకు కేటాయిస్తారు. పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లకుగాను ఉమ్మడి జిల్లా నుంచి గతేడాది 5900 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాలయ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించారు. జూన్ 13, జూలై 29, ప్రస్తుతం ఆగస్టు 27 వరకు గడువు తిరిగి పొడిగించారు. డిసెంబరు 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి ఇంటర్నెట్ ద్వారా మరింత సులభతరంగా దరఖాస్తులను అప్‌లోడ్ చేసేవిధంగా మార్పులు చేశారని ప్రిన్సిపాల్ తెలిపారు.
- రిజర్వేషన్లు ఇలా..
విద్యాలయంలో 80 సీట్లలో75 శాతం అంటే (60 సీట్లు) గ్రామీణ ప్రాంతం విద్యార్థుల కు, 25 శాతం అంటే (20 సీట్లు) ఓపెన్ కోటా కింద కేటాయిస్తారు. అందులో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాంగులు, బాలికలకు 1/3 వంతు రిజర్వేషన్ ఉంటుం ది. ఆరోతరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్యా భోదనతో పాటు కంప్యూటర్ విద్య, క్రీడలు, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం ఉంటుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండడంతో ఏటా 100 శాతం రిజల్ట్ వస్తోంది. నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. వీరు 01.05.2014 నుంచి 31.07.2016 మధ్య జన్మించిన వారై ఉండాలి. పరీక్ష రాసే విద్యార్థులు 3, 4, 5, తరగతులు గ్రామీణ ప్రాంతాలలో చదివి ఉత్తీర్ణులవ్వాలి.
9, 11లో ప్రవేశాలకు..
నవోదయ విద్యాలయంలో 2026-27 సంవత్సరంలో 9, 11వ తరగతిలో ఖాళీగా మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తులు చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సీట్లలో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి 8వ తరగతి విద్యార్థులు 9వ తరగతి కోసం, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. 9, 11వ తరగతిలో విద్యార్థులు 23-09-2025 చివరీ తేదీగా, 07-02-2026 పరీక్ష తేదీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్‌ఈఐటీఎంస్.ఎన్‌ఐసీఐఎన్/2025 వెబ్‌సైట్ ద్వారా పై తరగతు లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రేపాల క్రిష్ణ సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి
- రేపాల క్రిష్ణ, ప్రిన్సిపాల్
దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలి. నవో దయ విద్యాలయంలో ప్రవేశాలకు ఇప్పటికే గడువును మూడు సార్లు పెంచారు. ఏటా ప్రవేశ పరీక్ష పార దర్శకంగా నిర్వహి స్తున్నాం. అత్యుత్తమ విద్యా ప్రమా ణాలతో పాటు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, క్రమశిక్షణ ఉండే నవోదయలో సీటు కోసం దరఖా స్తులు చేసుకునే అవకాశాన్ని విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలి. 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలి.