Deadline Approaches for ESIC: స్ప్రీ పథకానికి 31 వరకు గడువు
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:13 AM
వివిధ రకాల ఉపాధి కల్పనా సంస్థలతో పాటు అందులో పనిచేసే వారి నమోదును ప్రోత్సహించేందుకు ఈఎ్‌సఐసీ ప్రవేశ పెట్టిన స్ర్పీ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్....
ఈఎస్‌ఐలో కొనసాగుతున్న ఉద్యోగులు,కంపెనీల నమోదు ప్రోత్సాహక పథకం
సరళమైన, ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): వివిధ రకాల ఉపాధి కల్పనా సంస్థలతో పాటు అందులో పనిచేసే వారి నమోదును ప్రోత్సహించేందుకు ఈఎ్‌సఐసీ ప్రవేశ పెట్టిన స్ర్పీ(స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్-2025) పథకం గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈఎ్‌సఐలో ఇప్పటి వరకు నమోదు చేసుకోని కంపెనీలు, సంస్థలు.. అర్హత కలిగిన ఉద్యోగులు, కార్మికుల స్వీయ నమోదును ప్రోత్సహించడానికి ఈ ఏడాది జూలై 1న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా పది లేదా అంత కంటే ఎక్కువ మంది కార్మికులను నియమించుకునే కర్మాగారాలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, రవాణా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు మొదలైన వాటిని నిర్వహించేవారు ఈఎ్‌సఐసీ పోర్టల్, శ్రమ్ సువిధా పోర్టల్, ఎంసీఏ పోర్టల్ ద్వారా తమ సంస్థలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్, సరళమైనది. ఈ పథకం కింద యజమాని పేర్కొన్న తేదీ నుంచి కవరేజ్ ప్రారంభమవుతుంది. దీనికి గత రికార్డులను సమర్పించాల్సిన అవసరం లేదు. గతానికి సంబంధించిన రికార్డులు తనిఖీలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులు ఈఎ్‌సఐ చట్టం కింద అందించే సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందగలరు. ఇందులో భాగంగా ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ స్థాయిలలో సమగ్ర వైద్య సంరక్షణ, ప్రసూతి సమయంలో నగదు ప్రయోజనాలు, విధి నిర్వహణలో ప్రమాదం, మరణం సంభవించినపుడు పరిహారం.. అర్హత గల కార్మికుల పిల్లలు ఈఎ్‌సఐసీ వైద్య, దంత కళాశాలల్లో వైద్య విద్యా కోర్సుల్లో రిజర్వేషన్లను పొందవచ్చు.
దేశంలోని 668 జిల్లాలలో అమలు
స్ప్రీ పథకం ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 668 జిల్లాల్లో అమలులో ఉంది. వీటిలో 565 జిల్లాలు పూర్తిగా నోటిఫై అయ్యాయి. ఈఎ్‌సఐ చట్టం కింద 2017 జనవరి 1 నుంచి ఈ పథకం పొందే కార్మికుల వేతన పరిమితి నెలకు రూ.21 వేలుగా (దివ్యాంగులకు రూ.25వేలు)ఉంది. 2019 జూలై 1 నుంచి ఉద్యోగుల వేతనాల నుంచి 0.75 శాతం వాటా, యజమానుల నుంచి 3.25 శాతం వాటా ఈఎ్‌సఐకి జమవుతోంది. తెలంగాణలో ఈ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 19.16 లక్షల మంది పురుషులు, 5.37 లక్షల మంది మహిళలు, 1.36 లక్షల మంది యజమానులు, 76.64 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీలు, 10 డీసీబీలు, 8 బ్రాంచ్ ఆఫీసుల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను అందిస్తోంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎ్‌సఐసీ వైద్య విద్యా కళాశాల, హాస్పిటల్.. ఈఎ్‌సఐసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా ఉన్నత స్థాయి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈఎ్‌సఐసీ ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్స అందుబాటులో లేని సందర్భాల్లో.. ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు.