నామినేషన్ కేంద్రాలు తనిఖీ చేసిన డీసీపీ
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:15 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను డీసీపీ భాస్కర్ ఆదివారం తనిఖీ చేశారు. వీగాంలోని ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు.
భీమిని, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను డీసీపీ భాస్కర్ ఆదివారం తనిఖీ చేశారు. వీగాంలోని ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియామళిని అందరూ పాటించేలా చూడాలన్నారు. సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తాండూరు సీఐ దేవయ్య ఉన్నారు.