CS Informs HC: నిషేధిత జాబితా భూముల వివరాలు సేకరిస్తున్నాం
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:33 AM
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిషేధిత జాబితాలోని భూముల వివరాలు సేకరిస్తున్నామని, నిర్దేశిత గడువులోగా ...
హైకోర్టుకు వెల్లడించిన సీఎస్
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిషేధిత జాబితాలోని భూముల వివరాలు సేకరిస్తున్నామని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని సీఎస్ రామకృష్ణారావు హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రమాణపత్రం దాఖలు చేశారు. నిషేధిత జాబితాలోని భూముల వివరాల సేకరణ ప్రక్రియను తొమ్మిది వారాల్లోగా పూర్తి చేయాలని, 10 రోజుల్లోగా ప్రమాణపత్రం దాఖలు చేయకుంటే సీఎస్ ప్రత్యక్షంగా హాజరు కావాలని జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రమాణపతరం దాఖలు చేసిన సీఎస్.. నిషేధిత జాబితా భూముల వివరాల సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.