Vemulawada Temple: వేములవాడలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై దర్శనం
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:40 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై దర్శనం కల్పించనున్నట్లు దేవాదాయశాఖ...
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై దర్శనం కల్పించనున్నట్లు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. ఆలయ విస్తరణ, నిర్మాణ పనుల నేపథ్యంలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్జిత సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, మేడారం జాతర సమయంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు, తర్వాత తాత్కాలిక ఏర్పాట్లతో దర్శన సౌకర్యం కల్పిస్తామని శైలజా రామయ్యర్ తెలిపారు.