kumaram bheem asifabad- ‘దారి’ద్య్రం
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:21 PM
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మట్టి రోడ్లు అధ్వా నంగా మారాయి. వర్షాలు పడితే నడక కూడా కష్టం మారుతోంది. బురదరోడ్డపై వాహనదారులు, పాదచా రులు నడవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా తారు రోడ్లకు నోచుకోవడం లేదు.
- మారుమూల ప్రాంతాల్లో మరీ అధ్వానం
- రాకపోకలకు వాహనదారుల అవస్థలు
- పట్టించుకోని అధికారులు, పాలకులు
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మట్టి రోడ్లు అధ్వా నంగా మారాయి. వర్షాలు పడితే నడక కూడా కష్టం మారుతోంది. బురదరోడ్డపై వాహనదారులు, పాదచా రులు నడవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా తారు రోడ్లకు నోచుకోవడం లేదు.
ఆసిఫాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ రోడ్లు ఆధ్వానంగా మారాయి. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మారు మూల గ్రామాలు నేటికి కనీసం రహదారులకు నోచుకోని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షం వస్తే చాలు భయంగుప్పిట్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి నాటు వైద్యంను ఆశ్రయించాల్సిన వస్తుంది. దీంతో ఒక్కో సారి ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సంఘటనలు ఉన్నాయి. గ్రామాల్లో డయేరియా, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలినట్లయితే గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు 104, 108 వాహనాలు సైతం వెళ్లలేని దయనీయ దుస్థితి నెలకొంది. పాలకులు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇస్తున్నా ఆచరణకు నోచుకో వడం లేదు. వారం రోజులుగా జిల్లా అంతట కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయం కావడం, లో లెవల్ వంతెనల పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- గ్రామీణ రోడ్లు అధ్వానం..
జిల్లాలో ఎక్కడ లేని రీతిలో గ్రామీణ రహదారుల వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా తయారైంది. రోడ్లు నిర్మించక పోవడంతో ఆయా గ్రామాలు వాగులు, వంకల గుండా, అడవుల మీదుగా ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది. ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లతో పాటు అంతర్గత రహదారుల వ్యవస్థ సరిగ్గా లేక పోవడంతో నేటికీ పల్లెలు అభివృద్ధి నోచుకోవడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన అధ్యాయనంలో మొత్తం 335 గ్రామ పంచాయతీల పరిధిలోని 449 గిరిజన గూడాలకు అసలే రోడ్డు సౌకర్యం లేనట్లుగ గుర్తించారు. ఇందులో ఆసిఫాబాద్ నియోజక వర్గానికి సంబంధించి అత్యధికంగా 305 గ్రామాలు ఉన్నాయి. సిర్పూర్ నియోజక వర్గంలో 144 గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉన్నట్లు గుర్తించారు.
చిత్తడి..చిత్తడి..
జిల్లాలోని 15 మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో చిన్న పాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి నడవడానికి సైతం వీలు లేకుండా పోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. జిల్లాలో మండలాల వారిగా రోడ్ల దుస్థితిని పరిశీలిస్తే... ఆసిఫాబాద్ మండలంలోని హీరాపూర్, గుడిగుడి, అప్పపల్లి, మోవాడ, అడదస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల రోడ్లు వర్షానికి చిత్తడిగా మారడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇటివల కురిసిన వర్షాలకు రాజురా గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాక పోకలకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాంకిడి మండలంలోని సామెల, కిర్డి, కెరమెరి మండలంలోని నాగల్‌గొంది, కైరి, నీమ్‌గూడ, నిశానీ, లింగాపూర్ మండలంలోని లెండిగూడ,చోర్ పల్లి, బీమన్‌గోంది, లొద్దిగూడ, మొడిగూడ, హీరాపూర్, జైనూర్ మండలంలో రావూజీగూడ, లొద్దిగూడ సిర్పూర్(యూ) మండలంలో చాప్రి, బుర్నుర్-కె గ్రామాల రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారాయి. తిర్యాణి మండలంలోని అర్జున్‌లొద్ది, అల్లిగూడ, భీంరాల, మార్కగూడ, ఏదులపహాడ్, పంగిడి, పాతదంతన్‌పల్లి, బెజ్జూరు మండలంలోని కృష్ణపల్లి- సోమిని, రంగాపూర్, అంబగట్టు, బుర్గుడ, రెచిని, ఇందూర్‌గాం, సలుగుపల్లి గ్రామాలలోని అంతర్గత రోడ్లు బురదమ యంగా మారాయి. దహెగాం మండలంలోని పోలంప ల్లి, బోప్పురం, మొర్లిగూడ, పెంచికలపేట మండలంలో కొండపల్లి, జైహింద్‌పూర్, మొర్లిగూడ, కమ్మర్ గాం, అగర్‌గూడ తదితర గ్రామాల్లో రోడ్లు పూర్తిగా అధ్వా నంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బురదలోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. గ్రామీణ రోడ్ల దుస్థితి దయనీయంగా ఉన్నా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
- రాథోడ్ అనిల్, లొద్దిగూడ, లింగాపూర్ మండలం
ఏటా వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మార డంతో ఇబ్బందులు పడుతున్నాం. పనుల కోసం మం డల, జిల్లా కేంద్రాలకు బురద రోడ్ల మీదుగా అష్టక ష్టాలు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తారురోడ్ల నిర్మా ణం చేపట్టి మా కష్టాలను గట్టెక్కించాలి.