kumaram bheem asifabad- ప్రమాదం..ఇలా పసిగట్టొచ్చు
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:56 PM
వాతావరణ పరిస్థి తులు, ప్రకృతి వైఫరీత్యాలను ముందస్తుగానే పసిగట్టే వీలుంది. పిడుగు, వర్షాలు, ఈదురుగాలుల వంటి ప్రమాదాలను ముందే తెలుసుకోవచ్చు. పిడుగు ఎప్పు డు, ఎక్కడ పడుతుందో తెలియక ప్రజలు, మూగజీ వాలు మృత్యువాత పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి వైఫరీత్యాలను ముందస్తుగా తెలుసు కొనేందుకు దామినీ మేఘాదూత్, రెయిన్ అలారం లాంటి యాప్‌లను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది
- పలు యాప్‌లను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
- అప్రమత్తతోనే సంపూర్ణ రక్షణ
కౌటాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వాతావరణ పరిస్థి తులు, ప్రకృతి వైఫరీత్యాలను ముందస్తుగానే పసిగట్టే వీలుంది. పిడుగు, వర్షాలు, ఈదురుగాలుల వంటి ప్రమాదాలను ముందే తెలుసుకోవచ్చు. పిడుగు ఎప్పు డు, ఎక్కడ పడుతుందో తెలియక ప్రజలు, మూగజీ వాలు మృత్యువాత పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి వైఫరీత్యాలను ముందస్తుగా తెలుసు కొనేందుకు దామినీ మేఘాదూత్, రెయిన్ అలారం లాంటి యాప్‌లను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లతో ముందస్తుగా అప్రమ త్తమై ప్రమాదం నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు. ఈ యాప్‌లపై అవగాహన లేని ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మూగజీవాల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.
- దామినీ యాప్..
పిడుగు ఎప్పుడు, ఎక్కడ పడుతుందో ముందస్తుగా పసిగట్టడం దామినీ యాప్ లక్షణం. సాధారణంగా వర్షాకాలంతో పాటు ఏప్రిల్, మే నెలల్లో పిడుగులు పడడం సహజం. వ్యవసాయ పనుల హడావుడిలో ఉండే రైతులు పిడుగు పడే సమయంలో దగ్గరలోని ఎత్తయిన చెట్ల కిందికో, ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. అవి అంత సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రైతులను అప్రమత్తం చేసేదే దా మని యాప్. దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది సమీపంలోని 20 కిలో మీటర్ల దూరంలో 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్కడ పిడుగు పడుతుందో అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల ప్రమాదం ముందస్తుగా పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లొచ్చు.
-మేఘాదూత్ యాప్..
ఈదురు గాలులు, వాతావరణ సమత్యులతను ముం దస్తుగా పసిగట్టి సమగ్ర సమాచారం అందించేందుకు మేఘాదూత్ యాప్ ఉపయోగ పడుతుంది. పంట చేలకు ఎరువులు అందించాల్సిన సమయంలో లేదా వరి కోతల సందర్భంగా రైతులకు నష్టం చేసేవి వర్షాలే. దీనిని తప్పించేందుకు భారత వాతావరణ శాఖ మేఘాదూత్ యాప్‌నకు రూపకల్పన చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే తాజా సమా చారం తెలిసోతుంది. రాబోయే ఐదు రోజుల్లో వాతావర ణ మార్పులు, వర్ష సూచనలు సహా ఆకాశం మేఘావృ తం అవుతుందా, లేదా, గాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ దిశగా వీస్తాయో తెలుసుకోవచ్చు.
- రెయిన్ అలారం..
చుట్టూ 20 కిలో మీటర్ల దూరంలో ఎప్పుడు, ఎక్కడ వర్షం పడుతుందో ముందస్తుగా తెలుసుకునేందుకు రెయిన్ అలారం యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో రేయిన్ అలారం అని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే ఈ యాప్ కనిపిస్తుంది. కేవలం ఒక నిమిషంలో డౌన్ లోడ్ అవుతుంది. వినియోగ దారుడు అందించిన వివరాల మేరకు అతను ఉన్న ప్రాంతానికి సమీపంలో 20 కిలో మీటర్ల దూరంలోనే ఎక్కడ వర్షం పడే సూచనలు ఉన్నాయో సమగ్ర సమాచారం క్షణాల్లో అందిస్తుంది. దీంతో వర్షం ముప్పు నుంచి ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇలా..
- ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్న సమ యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరి స్తున్నారు.
- ఎత్తగా ఉన్న ప్రదేశాలు, చెట్ల కింద ఉండకూడదు.
- విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
- ల్యాండ్, సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు.
- విద్యుత్ సరఫరా అయ్యే ఇనుము, రాగి, ఇత్తడి, అల్యూమినియం లాంటి వస్తువులను తాకరాదు.
- వర్షంలో వంట సామగ్రి, బోళ్లు కడగవద్దు.
- ఇంట్లో నుంచి బయటకు వెళ్లరాదు.
ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు పాటు నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.