kumaram bheem asifabad- ప్రారంభమైన దండారి సంబరాలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:26 PM
మారుమూల గ్రామాల్లో దండారి సంబరాలు జోరందుకున్నాయి. గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసిన ఆదివాసులు నూతన వస్త్రాలు ధరించి గుస్సాడీలతో కలసి చేస్తున్న నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆదివాసులు సాంప్రదాయబద్ధగా ప్రత్యేక పూజలు చేసి ఆటల పాటలతో సంగీతం, డప్పులు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తున్నారు. ఆదేవిధంగా స్నేహ భావం, కలివిడి తత్వంతో దండారిలు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి రాక పోకలు చేస్తు సంబరాలు చేసుకుంటున్నారు.
జైనూర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల్లో దండారి సంబరాలు జోరందుకున్నాయి. గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసిన ఆదివాసులు నూతన వస్త్రాలు ధరించి గుస్సాడీలతో కలసి చేస్తున్న నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆదివాసులు సాంప్రదాయబద్ధగా ప్రత్యేక పూజలు చేసి ఆటల పాటలతో సంగీతం, డప్పులు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తున్నారు. ఆదేవిధంగా స్నేహ భావం, కలివిడి తత్వంతో దండారిలు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి రాక పోకలు చేస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా దండారిలకు గ్రామస్థులు గౌరవంగా వారికి ఆతిథ్యమిస్తున్నారు. మండలంలోని జామ్ని గ్రామానికి చెందిన దండారి బృందం పవర్ గూడకు తరలి వచ్చింది. రాత్రంతా ఆటల పాటలతో వారు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామస్థులు అనక రాంజీ, అనక హన్మంతు, తోడ్సం గంగారాం, తోడ్సం రాజేందర్, తోడ్సం జంగు, ఉయిక శ్రీనివాస్, ఉయిక జ్ఞానేశ్వర్, అనక రాంశాశావ్, మడావి హన్మంతు, కనక భీంరావ్, ఆత్రం బళిరాం తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఉషేగాంలో శుక్రవారం దండారి ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీలు దేవతకు సాప్రదాయం ప్రకారం పెద్దలు, పిల్లలు కను బొమ్మ, తల వెంట్రుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో దండారి సబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కుంర భగ్వంత్‌రావ్, మాజీ సర్పంచ్ ఉయిక రమాకాంత్, ఎస్సీఈఅర్పీ ఉయిక శంకర్ గ్రామ పటేల్, దేవారి, గ్రామస్థులు ఉన్నారు.
లింగాపూర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో శుక్రవారం దండారి సంబరాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకుంటారు. శుక్కవారం మండల కేంద్రంలో మాజీ జడ్‌పీటీసీ లక్యానాయక్, తదితర మండల నాయకులు దండారిలను సందర్శించారు. ఘుసాడిలకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ గంగు, మహదు, మేస్రం మాదిపటేల్, పూర్కప్రకాశ్ తదితరులుపాల్గొన్నారు.