Share News

kumaram bheem asifabad- దండారి సంబరాలు ప్రారంభం

ABN , Publish Date - Oct 16 , 2025 | 10:31 PM

ఆదివాసీ గ్రామాల్లో దండారి(ఎత్మసార్‌ దైవం)సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివాసీ గూడేలలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గుస్సాడి నృత్యాలు, డప్పుల మోతలు వినిపిస్తున్నాయి. ఆదివాసీలు నిర్వహించే దండారి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. దీపావళి పండుగకు నాలుగైదు రోజుల ముందు ముఖ్యంగ దండారి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించడం ఆదివాసీల అనవాయితీ.

kumaram bheem asifabad-  దండారి సంబరాలు ప్రారంభం
నృత్యం చేస్తున్న ఆదివాసీలు

సిర్పూర్‌(యు), అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గ్రామాల్లో దండారి(ఎత్మసార్‌ దైవం)సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివాసీ గూడేలలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గుస్సాడి నృత్యాలు, డప్పుల మోతలు వినిపిస్తున్నాయి. ఆదివాసీలు నిర్వహించే దండారి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. దీపావళి పండుగకు నాలుగైదు రోజుల ముందు ముఖ్యంగ దండారి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించడం ఆదివాసీల అనవాయితీ. పండుగ అనంతరం నిర్వహించే కోలబోడి పండుగతో ముగుస్తాయి. మండలంలోని ఖాతీగూడ, పూల్లర, పంగడి, నేట్నూర్‌, పాములవాడ, శేట్టిహాడ్పూర్‌, కోహినూర్‌, పిట్టగూడ, రాఘాపూర్‌, బండేయేర్‌, మూంజీగూడ, సీతాగోంది, ధనోర, పెద్ద దోబ తదితర ఆదివాసీ గ్రామలలో దండారి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా ఆదివాసీ గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. గురువారం పూల్లర గ్రామానికి చెందిన దండారి మండల కేంద్రంలోని ప్రెసిడేంట్‌గూడలో గల సిర్పూర్‌కర్‌ ఆత్రం వంశీయుల పెద్ద దేవుడి దర్శనం కోసం చేరుకున్నారు. ఈ సందర్భంగా జైనూర్‌ సీఐ రమేశ్‌, జైనూర్‌ మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, సిర్పూర్‌(యు) ఎస్సై రామకృష్ణ, నాయకుడు తోడసం ధర్మరావు దండారి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆదివాసీల గుస్సాడి నృత్యాలను తిలకించారు. కార్యక్రమంలో సిర్పూర్‌కర్‌ ఆత్రం వంశీయుల లింబారావు కటోడ(కులగురువు), గ్రామ పటేళ్లు దుర్వా మోతిరాం, ఆత్రం ఆనంద్‌రావు, ఆత్రం నేహ్రూ, ఆత్రం జ్యోతిరాం, ఆత్రం మానిక్‌రావు, ఆత్రం కర్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 10:31 PM