Share News

Damodara Rajanarsimha: వ్యవసాయం పండుగలా మార్చిన ఘనత రేవంత్‌ సర్కారుదే

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:48 AM

వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

Damodara Rajanarsimha: వ్యవసాయం పండుగలా మార్చిన ఘనత రేవంత్‌ సర్కారుదే

  • సంగారెడ్డి జిల్లాలో 3.75 లక్షల మంది రైతులకు రూ.425.17 కోట్ల

సాయం:దామోదర జోగిపేట, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లు జమ చేసి చూపామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం సంగుపేట క్లస్టర్‌ రైతు వేదికలో రైతు పండుగ సంబురాలను ప్రారంభిస్తూ.. జిల్లాలో రైతు భరోసా కింద 3,75,932 మంది రైతుకు రూ.425.17 కోట్ల సాయం అందజేశామని పేర్కొన్నారు. రైతును రాజుగా చూడాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. అందుకే రైతు భరోసాతోపాటు పలు పథకాలను రేవంత్‌ రెడ్డి సర్కారు అమలు చేస్తోందన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 07:49 AM