kumaram bheem asifabad- దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు
ABN , Publish Date - Oct 31 , 2025 | 10:29 PM
జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి, ఇతర పంటలు నేలపాలయ్యాయి. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షాలకు పైరు నేలవాలి గింజలు రాలడమే కాకుండా పంట నీట మునిగాయి. వరి, పత్తి పరిస్థితి మరింత దయనీ యంగా మారింది.
బెజ్జూరు/పెంచికలపేట/కాగజ్‌నగర్‌టౌన్/దహెగాం/సిర్పూర్(టి)/అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి, ఇతర పంటలు నేలపాలయ్యాయి. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షాలకు పైరు నేలవాలి గింజలు రాలడమే కాకుండా పంట నీట మునిగాయి. వరి, పత్తి పరిస్థితి మరింత దయనీ యంగా మారింది. మండలంలో గత రెండు రోజులుగా కురుస్తునన వర్షాలకు రైతులు సాగు చేస్తున్న పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అతి వృత్తి కారణంగా కనీసం పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా నీటిలో తడిచి పోవడంతో నేల వాలింది. దహెగాం మండలంలోని లగ్గాం, దహెగాం, కల్వాడతో పాటు వరి పంట చేతికి అందివచ్చిన సమయంలో నేలపాలైంది. వరి నేల పాలు కావడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా పత్తి పంట ఏరివేత దశలో వర్షాలు కురుస్తుం డడంతో కాయలు నల్లబడి పోతుందని రైతులు ఆవేధన వయకతం చేస్తున్నారు. పూత కాత రాలి పోతుందని వాపోతున్నారు. సిర్పూర్(టి) మండలం లోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో 27 గ్రామాల్లో ఈ ఖరీఫ్‌లో దాదాపు వరి 4,300 ఎకరాల్లో, పత్తి 16 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే వరి, పత్తి పంటలు చేతికి వచ్చే దశలో మొంథా తుఫాను ప్రభావంతో పంటల దిగుబడిపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు తొందర పడి తమ పంట కోతులు చేపట్టరాదని ఎండలు కొట్టే వరకు కోతలు మొదలు పెట్టవద్దని ఏవో గిరీష్ తెలిపారు. అలాగే రైతులు ఆయా ఏఈవోల వద్ద తమ పంటల వివరాలను నమోదు కోసం పటాట పాసు పుస్తకం, ఆధార్‌తో జతపరిచి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. కాగజ్‌నగర్ మండ లంలో పత్తి పంట అకాల వర్షాలకు దెబ్బతినే అవకాశాలుండడంతో దిగాలు పడుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న గాలులు, వర్షాలకు వరి కోతకు ముందే నేల వాలుతోంది. వేలాది ఎకరాల్లో పంట నష్టం కలుగుతుండడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. ర వరి పంట నేల కొరగడంతో పాటు పలు చోట్ల తడిసి పోవడంతో ధాన్యం రంగు మారి గిట్టుబాటు ధర రావడం కూడా గగనంగానే మారిందనే రైతులు వాపోతున్నారు. మరి కొన్ని చోట్ల పత్తి తడిసి నల్లగా మారి పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెంచికలపేట, మండల వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ఏరివేతకు సిద్ధంగా ఉన్న పత్తి పంట తడిచి పోగా కాయలు మురిగి పోయే దశకు చేరుకున్నాయి. ఈ అకాల వర్షా ల కారణంగా కనీసం పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు.