గెజిట్ ప్రకారం డైలీ వర్కర్ల వేతనాలు ఇవ్వాలి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:17 PM
: కలెక్టర్ ఇచ్చిన గెజిట్ ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న డైలీవైజ్ వర్కర్ల వేతనాలు ఇవ్వాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 21 ఆంధ్రజ్యోతి) : కలెక్టర్ ఇచ్చిన గెజిట్ ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న డైలీవైజ్ వర్కర్ల వేతనాలు ఇవ్వాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళ వారం సీఐటీయూ ఆధ్వర్యంలో గిరిజ న ఆశ్రమ పాఠశాల డైలీ వర్కర్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగికి విన తిపత్రం అందజేశారు. ఆర్.శ్రీనివాస్ మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాల లు, గురుకులాల్లో పని చేస్తున్న డైలీవైజ్ వర్క ర్లు 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్ట నట్లు వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ఇస్తున్న వేతనాల కంటే తగ్గిస్తూ జీవో 64 తీసుకురావడం కార్మికులకు శాపంగా మా రిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శంకర్‌నాయక్, డైలీ వ ర్కర్స్ ఆండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, భరత్, ఎల్లమ్మ, పద్మ, బాలమణి, నాగమ్మ, జయమ్మ, రాంజీ, రాంలాల్, రాము తదితరులు పాల్గొన్నారు.