Share News

Cyber Fraudsters Scam: స్నేహా సర్దా... రూ.6 కోట్లు సర్దేసింది..

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:19 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మాయిల పేరుతో వాట్సాప్‌ చాటింగ్‌ చేసి..

Cyber Fraudsters Scam: స్నేహా సర్దా... రూ.6 కోట్లు సర్దేసింది..

  • వాట్సా్‌పలో అమ్మాయి పేరుతో చాటింగ్‌

  • ట్రేడింగ్‌లో లాభాల పేరుతో సైబర్‌ మోసం

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మాయిల పేరుతో వాట్సాప్‌ చాటింగ్‌ చేసి బాధితుల నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్లపైగా పోగొట్టుకున్న బాధితులు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీఎ్‌సబీ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు కేసుల్లోనూ బాధితులతో వాట్సా్‌పలో చాటింగ్‌ చేసింది స్నేహా సర్దా అనే పేరుతోనే కావడం విశేషం. మణికొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఫోన్‌ నెంబరును నేరగాళ్లు ఓ వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ చేశారు. స్నేహా సర్దా అనే అమ్మాయి పేరుతో చాటింగ్‌ చేసి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించారు. నెలన్నర వ్యవధిలో అతడి నుంచి దశల వారిగా రూ.3 కోట్ల వరకు వసూలు చేశారు. ఖాతాలో లాభాలు చూపిస్తున్నా... డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సీఎ్‌సబీ పోలీసులను ఆశ్రయించాడు. మరో కేసులోనూ ఇదే తరహాలో శేరిలింగంపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ను సైబర్‌ నేరగాళ్లు రూ.3 కోట్ల పైగా మోసగించారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 04:19 AM