Share News

Cyber Crime Police: ఇప్పుడు గుర్తొచ్చిందా రవి

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:52 AM

సినిమా పైరసీ, కాపీరైట్‌ ఉల్లంఘన కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవికి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రివర్స్‌లో బొమ్మ చూపిస్తున్నట్లు తెలిసింది.

Cyber Crime Police: ఇప్పుడు గుర్తొచ్చిందా రవి

  • ఐ బొమ్మ రవికి బొమ్మ చూపిస్తున్న పోలీసులు

  • ఫోన్‌, ల్యాప్‌టా్‌పలో డాటా మొత్తం రిట్రీవ్‌..!

హైదరాబాద్‌సిటీ, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): సినిమా పైరసీ, కాపీరైట్‌ ఉల్లంఘన కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవికి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రివర్స్‌లో బొమ్మ చూపిస్తున్నట్లు తెలిసింది. గతంలో రెండుసార్లు 8 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులకు రవి చుక్కలు చూపించాడు. విచారణలో ఏదిఅడిగినా చెప్పకుండా సమాధానాలు దాటవేశాడు. అయితే, సైబర్‌ క్రైమ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో టెక్నికల్‌ టీమ్‌.. రవి ల్యాప్‌టాప్‌, ఫోన్‌లోని డేటాను రీట్రీవ్‌ చేసింది. రవికి ఉన్న నెట్‌వర్క్‌, బెట్టింగ్‌ యాప్స్‌ సమాచారం, యాడ్‌ ఏజెన్సీల నుంచి వచ్చిన డబ్బు, బ్యాంకు లావాదేవీలను సేకరించింది. 10దేశాల్లో అతడి నెట్‌వర్క్‌ ఉన్నట్లు గుర్తించింది. సినిమా పైరసీ కోసం అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో ఏర్పాటు చేసిన సర్వర్లు, కొనుగోలు చేసిన 110 డొమైన్లకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సంపాదించారు. ప్రతి రెండు నెలలకు ఒక దేశం వెళ్లి, అక్కడ తనకు సహకరించే టీమ్‌ సభ్యులతో సమావేశం నిర్వహించేవాడని, అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఇంట్లో విశ్రాంతి తీసుకొని వెళ్ల్లిపోయేవాడని గుర్తించారు. తాజాగా మరో సారి రవిని విచారిస్తున్న పోలీసులు.. ఆ వివరాలన్నీ అతడి ముం దుంచి ప్రశ్నించడంతో తెల్లమొహం వేసినట్లు తెలిసింది. ఐ బొమ్మ పోస్టర్‌ డిజైన్‌ చేసిన రవి స్నేహితుడు నిఖిల్‌నూ పోలీసులు విచారించినట్లు తెలిసింది.

Updated Date - Dec 21 , 2025 | 05:53 AM