CV Anand: హోం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:32 AM
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా...
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసిన సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హోంశాఖ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. శాఖలోని వివిధ సెక్షన్ల సిబ్బంది సీవీ ఆనంద్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.