Share News

యాదగిరిగుట్టలో భక్తుల సందడి

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:32 AM

యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి
ఉచిత దర్శన క్యూకాంప్లెక్స్‌లో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటం, వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇష్టదైవాలను దర్శించుకున్నారు. కొండకింద వైకుంఠ ద్వారం ఇరువైపుల, పాత గోశాల ప్రాంగణంలో వాహ నాలు పార్కింగ్‌ చేశారు. ప్రధానాలయం, శివాలయం, కల్యాణ మండపం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలల్లో కూడా కిటకిటలాడాయి. సుమారు 90వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా, ఉభయ క్యూలైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటలు, ధర్మదర్శనాలకు నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ విభాగాల నుంచి ఆలయ ఖజానాకు రూ.76, 51,701 ఆదాయం సమకూరిందని ఈవో వెంకట్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ జే. సుబ్బారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు నిత్యపూజలు నిర్వ హించారు. గర్భాలయంలో స్వయం భువు లకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండ పంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వా లు వైభవంగా చేపట్టారు. పాతగుట్టస్వామి అమ్మవారికి నిత్యపూజలు నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలిం గేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో నిర్వహించారు.

అధ్యాత్మిక వాడల్లో ఈవో పర్యటన

కొండపైన, కింద అధ్యాత్మిక వాడల్లో దేవాదాయ కమిషనర్‌, ఆలయ ఈవో ఎస్‌. వెంకట్రావు పర్యటించారు. వారాంతపు రద్దీ నెలకొనగా క్యూలైన్‌లో భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిరువీధులు, ప్రసాదాల విక్రయశాల, శివాలయం, కొండకింద అన్నదాన సత్రం, కల్యాణకట్టతో పాటు లక్ష్మీ పుష్కరిణీని సందర్శించారు. గుండంలోని నీరు రంగు మారడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గుండంలోని నీటిని తొలగించి కొత్త నీటీతో నింపాలని అధికారులను ఆదేశించారు. మల్లాపురంలోని గోశాలను సందర్శించి ఎన్ని గోవులు ఉన్నా యి? వాటి మేత, దాన, వాటి ఆరోగ్యం తదితరాలపై ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

30 ఎకరాల భూమి సేకరించారు

గత ప్రభుత్వం 30 ఎకరాల తమ భూములను సేకరించిందని ఆలయ అభివృద్ధిలో భాగంగా క్షేత్రం ఉత్తర దిక్కులోని తమ వ్యవసాయ భూమి సేకరణతో ఉపాధి కోల్పోయామని యాదగిరిపల్లి దళితులు ఆదివారం ఈవోకు విన్నవించారు. మా పూర్వీకులు క్షేత్ర మందు వెట్టిచాకిరీ చేశారని తిరిగి మళ్లీ కులవృత్తికి సంబంధించిన టెండర్‌ నిర్వహించకుండా భక్తుల చెప్పుల నిర్వాహణ, డప్పులు కొట్టేందుకు అనుమతించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బూడిద సురేందర్‌, నర్సింహ, జానీ, నాగరాజు, స్వామి, శ్రీను, మధు, నరేష్‌, శివ, మిథున్‌చక్రవర్తి, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:32 AM