గూడెంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:30 PM
కార్తీక శుద్ధ చవితి సందర్బంగా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవా రం వందలాది మంది భక్తులతో తరలివచ్చి కార్తీక పూజలను నిర్వహిం చారు.
దండేపల్లి నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కార్తీక శుద్ధ చవితి సందర్బంగా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవా రం వందలాది మంది భక్తులతో తరలివచ్చి కార్తీక పూజలను నిర్వహిం చారు. ఉదయం గోదావరి నదిలో భక్తులు కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి, కుటుంబసమేతంగా భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం సత్యదేవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలతో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వంద లాది మంది భక్తులు కుటుంబ సమేతంగా స్వామి వ్రతాన్ని నోముకొని పూ జలు చేశారు. ప్రధానలయం ధ్వస స్తంబం, రావి చెట్లు వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలింగించి పూజలు చేశారు. దీంతో ఆలయం వద్ద భక్తులతో కార్తీక శోభ సంతరించుకుంది.