ధాన్యం కొనుగోళ్ల పేరుతో కోట్లు స్వాహా...
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:11 PM
వరి ధా న్యం కొనుగోలు చేయకపోయినా....తన పేరిట ఉన్న డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం కొనుగో లు చేసినట్లు తప్పుడు లెక్కలు సృష్టించి పౌర సరఫరా ల శాఖ ద్వారా రూ. 1.39 కోట్లు స్వాహా చేసిన మోస గాడి ఉదంతం అధికారులు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఈ అవినీతి, అక్రమా ల కు వ్యవసాయ శాఖ అధికారులు కూడా వత్తాసు ప లికారు.
-డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో అవినీతి బాగోతం
-ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని తాటిపెల్లి శ్రీనివాస్ నిర్వాకం
-వ్యవసాయ శాఖ అధికారులూ సూత్రదారులే
-పోలీసులకు అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి
మంచిర్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): వరి ధా న్యం కొనుగోలు చేయకపోయినా....తన పేరిట ఉన్న డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం కొనుగో లు చేసినట్లు తప్పుడు లెక్కలు సృష్టించి పౌర సరఫరా ల శాఖ ద్వారా రూ. 1.39 కోట్లు స్వాహా చేసిన మోస గాడి ఉదంతం అధికారులు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఈ అవినీతి, అక్రమా ల కు వ్యవసాయ శాఖ అధికారులు కూడా వత్తాసు ప లికారు. జిల్లాలో సంచలనం సృష్టించిన సంఘటన పూ ర్వపరాలు ఇలా ఉన్నాయి.....జైపూర్ మండలం నర్సిం గాపూర్ గ్రామానికి చెందిన తాటిపెల్లి శ్రీనివాస్ అలి యాస్ డీలర్ శీను పేరిట స్థానికంగా ధాన్యం కొనుగో లు చేసేందుకు డీసీఎంఎస్ సెంటరు ఉంది. దాంతో పాటు మండలంలోని రామారావుపేటలో సుముఖ ఆ గ్రో ఇండస్ట్రీస్ పేరిట ఓ బడా రైస్ మిల్లు కూడా నడు పుతున్నాడు. తాను నిర్వహిస్తున్న డీసీఎంఎస్ సెంటర్, రైస్ మిల్లు కేంద్రంగా భారీ మోసానికి తెరలేపాడు.
అవినీతి జరిగిందిలా....
2024-25 రబీ సీజన్‌కు సంబంధించి తాటిపెల్లి శ్రీని వాస్ నర్సింగాపూర్ గ్రామంలోగల తన డీసీఎంఎస్ సెంటరు ద్వారా జిల్లాలో 740 ఎకరాల్లో సాగైన రూ. 1.39 కోట్ల విలువగల 6,322 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎని మిది మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంలో తప్పుడు సమాచారం నమోదు చేశాడు. దీంతోపాటు ఆ ధాన్యాన్ని రామారావుపేటలో ఉన్న రైస్ మిల్లుకు త రలించేందుకు రవాణా ఖర్చుల కింద మరో రూ. 1.90 లక్షల ట్రక్ చిట్టీలు సృష్టించి అప్‌లోడ్ చేశాడు. ఆ వివ రాల ప్రకారం సదరు ఎనిమిది మంది రైతుల పేరిట పౌర సరఫరాల శాఖ రూ. 1.39 కోట్లను బ్యాంకు అకౌం ట్లలో జమ చేసింది. రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా కొ నుగోలు చేసిన ధాన్యానికి, సొమ్ము చెల్లింపులకు పొంత న లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయట పడింది. దీంతో ఆ శాఖ మంచిర్యాల మేనేజర్ శ్రీకళ జరిగిన మోసం పట్ల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్‌లో గత నెల 30 ఫిర్యాదు చేయడంతో అవినీతి బాగోతం వెలుగు చూసింది.
అధికారుల వత్తాసు...
పౌర సరఫరాల శాఖ నుంచి అక్రమంగా డబ్బు కొ ట్టేయాలని పన్నాగం పన్నిన తాటిపెల్లి శ్రీనివాస్, తన ప్రణాళిక అమలు చేయడానికి వ్యవసాయ శాఖ అధికా రులను మశ్చిక చేసుకున్నాడు. ఇందులో భాగంగా అత డు కొనుగోలు చేసిన 6,322 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎని మిది మంది రైతులు సాగు చేసినట్లు జైపూర్ మండల వ్యవసాయాఽధికారి మార్క్ గడ్సన్, విస్తరణాధికారి చం దన ధృవీకరించారు. అధికారుల నివేదిక ఆధారంగానే ధాన్యాన్ని రైతులు పండించినట్లు, దాన్ని తాను కొను గోలు చేసినట్లు నిరూపించగలిగిన తాటిపెల్లి శ్రీనివాస్ ధాన్యం విలువకు సరపడా నగదును స్వాహా చేశాడు. ఈ తతంగం నడిపించడానికి తాటిపెల్లి శ్రీనివాస్ తన భార్య శోభారాణి, కొడుకు సాయికుమార్, కోడలు కా వ్యతోపాటు దగ్గరి బంధువులు అక్కెనపల్లి స్వాతి, శ్రీశ రం గుణశేఖర్, రాచార్య సునీల్ కుమార్, వెలగడుల కరుణాకర్, మాసు సాయినాథ్‌లను పావులుగా వాడు కున్నాడు. వారే రైతులన్నట్లు నమ్మించి మోసానికి పా ల్పడగా, వారందరిపై జైపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
శ్రీనివాస్ లీలలెన్నో...!
తాటిపెల్లి శ్రీనివాస్ ప్రదర్శిస్తున్న లీలలు అన్నీ..ఇన్నీ కావు. రేషన్ పాపు డీలర్ షిప్ మొదలుకొని ఇసుక మా ఫియా, సింగరేణి ఓపెన్ కాస్టు భూముల్లో చేతివాటం, గుప్త నిధుల తవ్వకాల వరకు అక్రమ మార్గంలో సం పాదిస్తూ అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తి హాట్ టాపిక్‌గా మారాడు. డీలర్ శీను ఇచ్చే డబ్బులకు ఆశ పడి, అతని తప్పటడుగులకు మడుగులొత్తుతూ పను లు చక్కబెడుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారుల మెడ కు ఉచ్చు భిగుసుకుంటున్నా, వారిలో మార్పు రాక పో వడం గమనార్హం.
ఓసీపీ భూముల్లో చేతివాటం....
జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఐకే 1, 1ఏ గనులను ఓసీపీగా మార్చడం కోసం సింగరేణి అధి కారులు అవసరమైన 640.10 ఎకరాల భూములను సే కరించేందుకు 2016లో కలెక్టర్ అనుమతితో డ్రాఫ్ట్ డి క్లరేషన్‌ను జారీ చేశారు. ఓసీపీ ఏర్పాటు చేసేందుకు సేకరిస్తున్న భూముల్లో అధిక నష్టపరిహారం పొందే నెపంతో తాటిపెల్లి శ్రీనివాస్ గోదావరి నది సమీపంలో ఉన్న ఇందారం శివారు సర్వే నెంబర్ 406లో తన తల్లి పేరిట ఉన్న 4.32 ఎకరాలను నాన్ అగ్రికల్చర్ భూము లుగా మారుస్తూ నాలా కన్వర్షన్ పొందాడు. అలా ఎక రాకు రూ. 24.60 ధర ఉన్న సింగరేణి భూములను నాలా మార్చడం ద్వారా మూడు రెట్లు అధికంగా లబ్ది పొందగా, రూ. 3 కోట్ల పై చిలుకు చేతులు మారాయి. ఓసీపీ కోసం సేకరించే భూములకు సంబంధించి గోదా వరి జలాల్లో కలిసిపోయిన కొంత భాగం భూమిని సింగరేణి ఓసీపీ కొంద పోతున్నాయని పేర్కొంటూ జైపూర్ తహసీల్దార్ తాటిపెల్లి శ్రీనివాస్‌కు మేలు చేకూ ర్చే విధంగా రిపోర్టు తయారు చేశారు. ఈ విషయంలో డీలర్ శీనుకు సహకరించిన జైపూర్ మండల తహసీ ల్దార్ ప్రసాద్‌వర్మ, డిప్యూటీ తహసీల్దార్ పోచయ్యలను 2020 డిసెంబరు 21న కలెక్టర్ సస్పెండ్ చేశారు. పరోక్ష భాగమైన ఆర్డీవోలు శ్రీనివాస్, రమేష్‌లు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోయారు.
గుప్త నిధుల తవ్వకాల్లోనూ...
భీమారం ప్రాంతంలోని మాంతమ్మ ఆలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే సమా చారంతో 2018లో భీమారం పోలీసులు దాడులు జరిపి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల సంద ర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న జేసీబీతోపాటు ఒక ద్విచక్ర వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు త రలించారు. అక్కడ అనువైన స్థలం లేకపోవడంతో జై పూర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. కొద్ది రోజుల తరు వాత పోలీస్ స్టేషన్ నుంచి జేసీబీ మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. మాయమైన జేసీబీ తాటిపెల్లి శ్రీనివాస్‌ది కాగా, ఈ తతంగం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై లోతుగా విచారణ జరిపిన పోలీస్‌శాఖ ఉన్నతా ధికారులు పోలీస్ స్టేషన్ నుంచి జేసీబీ మాయం కావ డంలో జైపూర్‌లో పనిచేసిన ఓ ఎస్సై పాత్ర ఉందని నిర్దారించి, అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.