పంటలు వర్షార్పణం...
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:20 PM
జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని న ష్టం మిగిల్చాయి. అల్పపీడన ప్రభావం కారణంగా రెం డు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాల కార ణంగా నాట్ల దశలో ఉన్న వరి వరదల్లో కొట్టుకు పోగా, ఏపుగా పెరుగుతున్న పత్తిపంట పూర్తిగా నీట ముని గింది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ ప్రారం భమైన నాటి నుంచి నాలుగు దఫాలుగా వర్షాల కారణంగా పంటలు నీట మునగగా, రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
-గోదావరి ఉప్పొంగడంతో నీట మునిగిన వరి, పత్తి
-జిల్లాలో 13వేల పై చిలుకు ఎకరాలు వరదలపాలు
-ఒకే రోజు నీట మునిగిన రూ. 17 కోట్ల విలువైన పంట
-ప్రకృతి వైపరీత్యం కారణంగా రైతులకు తీరని నష్టం
-ప్రతిపాదనలకే పరిమితం అవుతున్న పరిహారం చెల్లింపులు
మంచిర్యాల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని న ష్టం మిగిల్చాయి. అల్పపీడన ప్రభావం కారణంగా రెం డు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాల కార ణంగా నాట్ల దశలో ఉన్న వరి వరదల్లో కొట్టుకు పోగా, ఏపుగా పెరుగుతున్న పత్తిపంట పూర్తిగా నీట ముని గింది. ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ ప్రారం భమైన నాటి నుంచి నాలుగు దఫాలుగా వర్షాల కారణంగా పంటలు నీట మునగగా, రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
జిల్లాలో 13వేల ఎకరాలు పంట నీటిపాలు...
ఈ నెల 28 తేదీన కురిసిన భారీ వర్షం కారణంగా జిల్లాలో 7781 మంది రైతులకు చెందిన 13126 ఎకరా ల్లో పంటలు వరదపాలయ్యాయి. భీమిని, తాండూరు, మందమర్రి, నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి, కోటపల్లి, బె ల్లంపల్లి, లక్షెట్టిపేట, కాసిపేట, హాజీపూర్, చెన్నూరు, జైపూరు, జన్నారం మండలాల్లో 3215 మంది రైతుల కు చెందిన 4964 ఎకరాల వరి పంట నీట మునగగా, 4538 మంది రైతులకు చెందిన 8107 ఎకరాల పత్తి చే లలో నీరు నిలిచింది. అలాగే 13 మంది రైతులకు చెం దిన 35 ఎకరాల మిర్చి, 15 మందికి చెందిన 20 ఎక రాల కూరగాయల సాగు సైతం వర్షార్పణం అయింది. వర్షాల కారణంగా వరికి ఎకరాకు రూ. 10వేల చొప్పున రూ. 4 కోట్ల 96 లక్షల 40 వేల వరకు నష్టం వాటిల్లగా, పత్తి పంటకు ఎకరాకు రూ. 15వేల చొప్పున మొత్తం 12 కోట్ల 16 లక్షల 5వేల రూపాయల వరకు నష్టం వా టిల్లినట్లు అంచనా వేస్తున్నారు. వర్షాలకు తోడు ఎల్లం పల్లి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో శుక్రవా రం వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఒక్క పాత మంచిర్యాలలోనే సుమారు వంద ఎకరాలకుపైగా పత్తి పంట నీట మునిగింది.
రైతులపై ప్రకృతి కన్నెర్ర...
ఈ యేడు ప్రకృతి వైపరీత్యం కారణంగా వేలాది ఎకరాల పంట నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వివిధ రకాల చేతికి వచ్చిన పంటలు నీటి పాలుకాగా, అల్పపీడన ప్రభావంతోనూ పెద్ద మొ త్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. పై మూడు నెలల్లో ఏకంగా 2,310 మందికి చెదిన 3,505 ఎకరాల పంట నీట మునగా, తాజాగా ఈ నెలలో కురిసిన వర్షాలు, వ రదల కారణంగా సుమారు వేలాది ఎకరాల వరకు నష్టం వాటిల్లగా సంబందిత రైతులకు కోట్లాది రూపా యలు నష్టం జరిగింది.
ప్రతిపాదనలకే పరిమితమైన పరిహారం....
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ. 10వేల పరిహారం అందిస్తామ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి నుం చి మొదలుకొని ఇప్పటి వరకు కురిసిన వర్షాల కార ణంగా రైతులకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ అ ధికారులు అంచనా వేసి, సంబంధిత రిపోర్టును ప్రభు త్వానికి అందజేస్తూ వస్తున్నారు. దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందకపోగా, ప్రతిపాదనల దశలోనే మగ్గుతున్నట్లు తె లుస్తోంది. మార్చి నుంచి మే వరకు జరిగిన నష్టం అధి కారుల అంచనా ప్రకారం రూ. 3 కోట్ల 50 లక్షల 63 వేల 250 ఉంటుంది. అలాగే ఆగస్టులో 28వ తేదీ వర కు సుమారు రూ. 25 కోట్ల మేర నష్టం వాటిల్లగా ఇం కా వర్షం, వరదల ప్రభావం కొనసాగుతుండటంతో న ష్టం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సీఎం ఆదేశాలతోనైనా పరిహారం అందుతుందా...?
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూ పం దాల్చడం వల్ల భారీ నష్టం సంభవించింది. వరదల ప్రభావాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 28న ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి, రిపోర్టును ప్రభుత్వానికి అందించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా సీఎం ఆదేశించడంతో అధికా రులు ఉరుకులు, పరుగుల మీద నష్టం అంచనా వేస్తు న్నారు. కనీసం ఇప్పుడైనా నష్టపరిహారం అందుతుందే మోనని రైతులు గంపెడాశతో ఉన్నారు.