Share News

Asifabad Rural: పంట నష్టం.. రైతు ఆత్మహత్య

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:47 AM

సాగు చేసిన పంట చేతికి అందక, పెట్టిన పెట్టుబడి రాదన్న ఆవేదనతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Asifabad Rural: పంట నష్టం.. రైతు ఆత్మహత్య

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సాగు చేసిన పంట చేతికి అందక, పెట్టిన పెట్టుబడి రాదన్న ఆవేదనతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని గొల్లగూడ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గొల్లగూడ గ్రామానికి చెందిన ఉప్పరి లచ్చయ్య (58) తనకున్న ఏడెకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాదేమోనని మనస్తాపానికి గురైన లచ్చయ్య, శుక్రవారం సాయంత్రం తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Dec 21 , 2025 | 05:47 AM