Share News

అటకెక్కిన ‘ఫసల్‌ బీమా’..!

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:57 PM

ఆరు గాలం కష్టించి రైతులు పండించిన పంటలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథ కం రాష్ట్రంలో అటకెక్కింది.

అటకెక్కిన ‘ఫసల్‌ బీమా’..!

తెలంగాణలో అమలుగాని పీఎంఎఫ్‌బీవై

బీఆర్‌ఎస్‌ హయాంలో పథకంపట్ల నిర్లక్ష్యం

అదేదారిలో కాంగ్రెస్‌

ప్రకృతి వైపరీత్యాలకు నిండా మునుగుతున్న రైతులు

మంచిర్యాల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆరు గాలం కష్టించి రైతులు పండించిన పంటలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథ కం రాష్ట్రంలో అటకెక్కింది. పీఎంఎఫ్‌బీవైతోపాటు పునర్‌ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధా రిత పంట ల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) 2018-19 సాగు కాలానికి సంబంధించి అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కేంద్రం లక్ష్యం విధించినప్పటికీ అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ల క్ష్యం కారణంగా రాష్ట్రంలో పథకం అమలు కు నోచు కోలేదు. పంట బీమా పథకంలో చేరేందుకు రైతులందరూ అర్హులుకాగా, పంట రుణం పొందే రైతులు పథకంలో తప్పనిసరిగా చేరాలనే నిబంధన ఉండేది. రుణం పొందని రైతులు బ్యాంకుల ద్వారాగానీ, అను మతి పొందిన మధ్యవర్తి సంస్థల ద్వారా, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా పథకంలో చేరే వెసులుబాటు కల్పించినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతు లు చేరేందుకు మొగ్గు చూపలేదు.

బీమాతో రైతుకు ధీమా....

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు రైతు లు బీమా చేయించడం వల్ల ఎలాంటి దిగులు లేకుం డా ధీమాగా ఉండవచ్చుననే ఉద్దేశ్యంతో కేంధ్ర ప్రభు త్వం పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎంఎఫ్‌బీవై ప థకం కింద విత్తనం విత్తినప్పటి నుంచి పంట కోత కు వచ్చే వరకు బీమా అమలుకానుండగా, దిగుబడి నష్టంపై ఆధారపడి బీమా వర్తిస్తుంది. అలాగే ఊ హించని ఉపద్రవం సంభవించి ప్రధాన పంటలకు నాట్లు వేయలేకపోవడం, స్థానిక విపత్తులు అయిన పంట నీట మునుగుటు, వడగండ్ల వాన, మట్టి పెళ్ల లు విరిగి పడటం, పంట మధ్యకాలంలో, పంట కోత ల తర్వాత 14 రోజుల వరకు తుఫాను ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది. బీమా పథకంలో చేరడం వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణం గా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందు తుంది. ఇదిలా ఉండగా, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ కింద అధిక లేదా అల్ప వర్షపాతం, రోజువారి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, చీడపీడలు (అధిక శాతం గాలిలో తేమ, గరిష్ట ఉష్ణోగ్రతలు), ఈదురు గాలుల కారణంగా పంట నష్టపోవడం వంటి వైపరీత్యాలకు బీమా వర్తిస్తుంది.

అవగాహన లేమితో....

పంట బీమా చేయించేందుకు అవగాహన లేమితో రైతుల నుంచి పెద్దగా స్పందన లేదనే చెప్పాలి. చివ రిసారిగా తెలంగాణ 2018-19 పంట కాలానికి సం బంధించి బీమా పథకం అమలు చేశారు. ఆ సమ యంలో జిల్లాలో 2600 హెక్టార్ల వరి పంటకు 2800 మంది రైతులు బీమా తీసుకోగా మొక్క జొన్నకు సంబందించి కేవలం 10 మంది రైతులు మాత్రమే బీమా తీసుకున్నారు. పంట బీమాకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే ఆనాడు భూ ముల క్రమబద్దీకరణకు సంబంధించి ధరణి పోర్టల్‌ బ్యాంకర్లకు అందుబాటులో లేకపోవడం కూడా బీ మా తీసుకోకపోవడానికి కారణమని తెలుస్తోంది. అ యినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సైతం పథకం లో చేరేలా రైతులను ప్రోత్సహించ లేదని అభిప్రా యాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అమలయ్యేనా....?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ప్రకృ తి వైపరీత్యాల కారణంగా రైతులు పంట నష్టపోకుం డా ఉండేందుకు ఫసల్‌ బీమా అమలు చేస్తామని తె లిపింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొ స్తున్నా ఫసల్‌ బీమా పథకం ప్రస్తా వన తేవడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రా ష్ట్రంలో ఫసల్‌ బీమా పథకం అమల్లోకి తెస్తే రైతుల కు మేలు చేసినట్లవుతుంది. రైతులు పథకంలో చేరి తే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటకు నష్టం జ రిగిన పక్షంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలే ఆ బాధ్యత వహించి, రైతుకు నష్టపరిహారం చెల్లిస్తాయి. తద్వారా పంట నష్టం జరిగినప్పుడల్లా ప్రభుత్వం అందిస్తున్న ఎకరాకు రూ. 10వేల పరిహార భారం కూడా ప్రభు త్వంపై పడదు. పథకాన్ని పున: ప్రవే శపెట్టి, రైతు లకు సరైన రీతిలో అవగాహన కల్పిస్తే పంట బీమా కు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అకాల వర్షంతో భారీ నష్టం...

మార్చి నెలలో కురిసిన అకాల వర్షం కారణంగా జిల్లాలో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మార్చి 21న కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా 113 మంది రైతులకు చెందిన 255 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోతదశకు వచ్చిన పంట పూర్తిగా నీటిపా లు కాగా, మొక్కజొన్న పంటకు కూడా పెద్ద మొత్తం లో నష్టం వాటిల్లింది. అయితే రాష్ట్రంలో ఫసల్‌ బీమా పథకం అమలు అయివుంటే రైతులకు నష్టం జరిగేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి కైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా పంట బీమా పథకం ప్రవేశపెట్టాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 20 , 2025 | 10:57 PM