Share News

సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:11 PM

సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని జైపూర్‌ ఏసీపీ వెం కటేశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని టేకుమట్ల గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను ప్రారంభించారు.

సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఏసీపీ వెంకటేశ్వర్‌

-జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌

జైపూర్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని జైపూర్‌ ఏసీపీ వెం కటేశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని టేకుమట్ల గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పురవీ ధుల గుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నేరస్తులను సులువుగా గుర్తించవచ్చన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. పోలీసులకు వ్యాపారస్తులు, ఇతర సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించా లని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, జైపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:11 PM