Tilak Varma Meets CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్ తిలక్‌వర్మ
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:53 AM
ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్‌వర్మ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు....
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్‌వర్మ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్‌ను.. సీఎం రేవంత్ సత్కరించారు. అనంతరం వర్మ తన బ్యాటును సీఎం రేవంత్‌కు బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, శాట్స్ ఎండీ సోనీబాలదేవి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు.