Share News

సృజనాత్మకతను పెంపొందించాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:44 PM

మారుతున్న అవసరాలను దృ ష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాల్సినవరం ఎంతైనా ఉన్ననది జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నస్పూర్‌ ప ట్టణంలోని తీగల్‌ పహాడ్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం పీ ఎం శ్రీ పాఠశాల భౌతిక, జీవ, గణిత స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఉపాధ్యా యులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సృజనాత్మకతను పెంపొందించాలి

జిల్లా విద్యాధికారి యాదయ్య

నస్పూర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : మారుతున్న అవసరాలను దృ ష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాల్సినవరం ఎంతైనా ఉన్ననది జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నస్పూర్‌ ప ట్టణంలోని తీగల్‌ పహాడ్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం పీ ఎం శ్రీ పాఠశాల భౌతిక, జీవ, గణిత స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఉపాధ్యా యులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల అవరణలో మొక్కలను నాటారు. అంతే కాకుండా పాఠశాలలో ఈ విద్యా సంవ త్సరంలో వందవ అడ్మిషన్‌ను తీసుకుకోవడానికి వచ్చిన విద్యార్థికి డీఈ వో యాదయ్య సమక్షంలో అడ్మిషన్‌ పొందాడు. అనంతరం డీఈవో మాట్లాడుతూ నూతన సైన్స్‌ పరికరాలను విద్యార్థులు వినియోగిం చు కునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వామన్‌ రావు, సెక్టోరయల్‌ అధికారు లు సత్యనారాయణ మూర్తి, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:44 PM