Share News

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:16 PM

విద్యార్థుల్లోని సృ జనాత్మకతను వెలికి తీయడం ఉపాధ్యా యుల బాధ్యత అని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అచ్చంపేటటౌన్‌,

మే 27 (ఆంధ్రజ్యో తి) : విద్యార్థుల్లోని సృ జనాత్మకతను వెలికి తీయడం ఉపాధ్యా యుల బాధ్యత అని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. 18వ వార్డు కౌన్సిలర్‌ అప్పశివ మునిసిపాలిటీ పరిధిలో పదవ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో 500 మార్కులుపైన సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందించి వారిని మరింత ప్రోత్స హించడం అభినందనీయమని అన్నారు. నల్ల మల ప్రాంతంలోని విద్యార్థులకు సీబీఎం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ చైర్మన్‌ రాజేందర్‌, నాయ కులు గోపాల్‌ రెడ్డి, కాశన్న యాదవ్‌, గౌరీశం కర్‌, కొయ్యల శ్రీనివాసులు, నర్సయ్య యాదవ్‌ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గ్గొన్నారు.

.

Updated Date - May 27 , 2025 | 11:16 PM