నకిరేకల్ ఆస్పత్రిలో ‘ఊయల’ ఏర్పాటు
ABN , Publish Date - May 14 , 2025 | 12:18 AM
నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో మంగళవారం ఊయలను ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి, ఐసీడీఎస్ సీడీపీవో అస్రా అంజుమ్ ప్రారంభించారు.
నకిరేకల్ ఆస్పత్రిలో ‘ఊయల’ ఏర్పాటు
నకిరేకల్, మే 13 (ఆంధజ్యోతి): నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో మంగళవారం ఊయలను ఆసుపత్రి సూపరింటెండెంట్ శోభారాణి, ఐసీడీఎస్ సీడీపీవో అస్రా అంజుమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు తమకు భారం అనుకున్న తల్లిదండ్రులు శిశువులను చెట్లపొదలు, మురికి కాల్వల్లో వదిలేస్తున్నారని అన్నారు. అలాంటి శిశువులను, వదిలివేయబడిన వారి రక్షణ కోసం ప్రభుత్వం ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరినైనా అనాథ బాలలుగా వదిలివేయవద్దని, పిల్లలను పోషించలేని వారు ఆ పిల్లలను ఆస్పత్రిలో ప్రారంభించిన ఊయలలో అప్పగించాలని సూచించారు. వారి వివరాలు ఎవరికీ తెలియజేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ ఉమ, డీసీపీయూ సిబ్బంది తేజస్విని, ఎన.రేవతి, సూపర్‌వైజర్లు జి.సునీత, ఎన.భవాని, ఎం. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.