Share News

కలె క్టరేట్‌ ఎదుట సీపీఎస్‌ విద్రోహ దినం....

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:40 PM

పాత పెన్షన్‌ సాధన కోసం టీజీఈ-జేఏసీ మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయ కులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చే శాయి. అంతకు ముందు జాతీయ రహదారి వద్ద క మాన్‌ నుంచి ఉరేగింపుగా చేతిలో ప్లకార్డులు పట్టుకు ని నినాదాలు చేస్తూ వచ్చారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట మానవహారంగా నిరసన వ్యక్తం చేస్తూ నినాదా లు చేశారు.

కలె క్టరేట్‌ ఎదుట సీపీఎస్‌ విద్రోహ దినం....
కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల జేఎసీ నాయకులు

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన

నస్పూర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పాత పెన్షన్‌ సాధన కోసం టీజీఈ-జేఏసీ మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయ కులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చే శాయి. అంతకు ముందు జాతీయ రహదారి వద్ద క మాన్‌ నుంచి ఉరేగింపుగా చేతిలో ప్లకార్డులు పట్టుకు ని నినాదాలు చేస్తూ వచ్చారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట మానవహారంగా నిరసన వ్యక్తం చేస్తూ నినాదా లు చేశారు. సీపీఎస్‌ వద్దు, ఓపీఎస్‌ ముద్దు, సీపీఎస్‌ రద్దు చేయాలి, ఓపీఎస్‌ పునరుద్ద రించాలి, సీపీఎస్‌ ఒక మోసం, ఓపీఎస్‌ ఒక భరోసా నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరా మ సమయంలో నిరసనకు దిగారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీ పక్‌కు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్దరిం చాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీహరి, వనజారెడ్డి, వేణుగోపాల్‌, శంకర్‌ గౌడ్‌, సాగర్‌, మల్లయ్య, సునిత, శ్రీపతి బాబూ రావు, రాజావేణు, కృష్ణ, రాకేష్‌ శర్మ, విజయ భారతి, గంగారాం, తిరుపతిలతో పాటు జిల్లాలోని 18 మండలా లకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి

బెల్లంపల్లి: లక్షలాది ఉద్యోగుల భద్రతను కుటుంబాల సంక్షేమాన్ని బలితీసుకున్న సీపీఎస్‌ స్కీం విధానాన్ని ప్ర భు త్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం కంట్రిబ్యూటరి పెన్షన్‌ స్కీం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:40 PM