John Wesley: పేదల భూములను లాక్కుంటే ఊర్కోం
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:31 AM
ప్రాజెక్టులు, పథకాల పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు...
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులు, పథకాల పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణ ప్రభావిత ఎనిమిది జిల్లాల సీపీఎం నాయకులతో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ప్రక్రియ శాస్త్రీయంగా జరపాలని డిమాండ్ చేశారు. భూసేకరణ వల్ల పేద ప్రజలు భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, వారి తరఫున సీపీఎం పోరాటం చేస్తుందని వెస్లీ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో రైతుల నుంచి భూములు సేకరించడం ఆమోదయోగ్యం కాదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు.