బీజేపీది అప్రకటిత ఎమర్జెన్సీ:సీపీఎం
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:13 AM
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిందని, నాటి కాంగ్రెస్ ప్రకటిత ఎమర్జెన్సీని విధిస్తే.. నేడు బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన సాగిస్తోందని సీపీఎం ఆరోపించింది.
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిందని, నాటి కాంగ్రెస్ ప్రకటిత ఎమర్జెన్సీని విధిస్తే.. నేడు బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన సాగిస్తోందని సీపీఎం ఆరోపించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బుధవారం నిరసనలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కాంగ్రెస్ పాలకులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని, ప్రస్తుతం బీజేపీ అదే ధోరణితో వ్యవహరిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నాడు కాంగ్రెస్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఎలా పోరాటం చేశారో.. అదేవిధంగా నేడు బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.