CPM leader B V Raghavulu: ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్ అవకాశవాదం
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:35 AM
రాజ్యాంగ రక్షణ కోసం ఒకవైపు, రాజ్యాంగ నాశనం మరొకవైపు అన్న కోణంలో జరుగుతున్న ముఖ్యమైన ఉప...
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
యాదాద్రి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ రక్షణ కోసం ఒకవైపు, రాజ్యాంగ నాశనం మరొకవైపు అన్న కోణంలో జరుగుతున్న ముఖ్యమైన ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్ అవకాశవాద వైఖరి ప్రదర్శించిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. లౌకిక వాదాన్ని రక్షించుకునేందుకు జరుగుతున్న ఉప ఎన్నికలో రాజ్యాంగాన్ని నాశనం చేసే వారికి బీఆర్‌ఎస్ పరోక్ష మద్దతునిచ్చిందని అన్నారు. వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమితే చరిత్ర హీనులవుతారన్న రాఘవులు.. ఈ పోరాటంలో బీజేపీ ఎక్కడుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.