Share News

CPI to Hold State Conventions: రేపటినుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:12 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి సీపీఐ సిద్ధమవుతోంది..

CPI to Hold State Conventions: రేపటినుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి సీపీఐ సిద్ధమవుతోంది. 20 నుంచి 22వ తేదీ వరకు జరిగే పార్టీ రాష్ట్ర 4వ మహాసభల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మహాసభల వేదికకు ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు దివంగత పొట్లూరి నాగేశ్వరరావు నగర్‌గా నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మహాసభల్లో మొత్త 743 మంది ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి దాదాపు వెయ్యి మంది పాల్గొంటారని చెప్పారు. బుధవారం జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ నుంచి మహా సభల వేదిక వరకు ఫ్లాగ్‌ మార్చ్‌ ఉంటుందన్నారు. మఖ్ధూం భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పొత్తు ఉంటుందని, కాంగ్రె్‌సతో స్నేహ సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 04:12 AM