CPI MLA Kunamneni Sambasiva Rao: సెప్టెంబరు 17ను విలీన దినోత్సవంగా జరపాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:15 AM
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం...
సీఎం రేవంత్‌కు కూనంనేని లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతేడాది దీనిని తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా నిర్వహించారని, కానీ అది చారిత్రక పోరాట స్ఫూర్తిని సరిగా ప్రతిబింబించలేదని కూనంనేని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, తెలంగాణ స్వాతంత్య్ర, రైతాంగ సాయుధ పోరాటాల చరిత్రను రాష్ట్ర, జాతీయ పాఠ్యాంశాలలో చేర్చాలని ఆయన కోరారు.