కార్మికుల క్లెయిమ్‌లను బీమా కంపెనీలకు అప్పజెప్పొద్దు
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:29 AM
భవన నిర్మాణ సంక్షేమబోర్డులో ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన వారి క్లెయిమ్‌లను బీమా కంపెనీలకు అప్పజెప్పాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని..
ఏఐటీయూసీ ధర్నాలో కూనంనేని సాంబశివరావు
చిక్కడపల్లి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ సంక్షేమబోర్డులో ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన వారి క్లెయిమ్‌లను బీమా కంపెనీలకు అప్పజెప్పాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని తెలంగాణ కార్మిక కమిషనరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
2009 నుంచి రాష్ట్రంలో కార్మికశాఖ ద్వారా కార్మికులకు పథకాలు అందుతున్నాయని, ఇప్పుడు బీమా రంగా నికి అప్పజెప్పడం సమంజసం కాదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎస్. బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.