Minister Tummala Nageswara Rao: పత్తి రైతుకు ఎమ్మెస్పీ దక్కాల్సిందే!
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:49 AM
రాష్ట్రంలో పత్తి రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) అందేలా సీసీఐ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు...
అక్టోబరు నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలి
సీసీఐ, మార్కెటింగ్ అధికారులు కలిసి పనిచేయాలి: తుమ్మల
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) అందేలా సీసీఐ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారుప్రస్తుతం మార్కెట్ ధర ఎమ్మెస్పీ కంటే క్వింటాకు రూ.1099 తక్కువ ఉందన్నారు. పొడవు పింజ పత్తికి క్వింటాకు రూ.8,110 చొప్పున, మధ్యస్థ పింజ పత్తికి క్వింటాకు రూ.7,710 చొప్పున రైతులకు ఎమ్మె స్పీ దక్కాల్సిందేనని చెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా భారత పత్తి సంస్థ (సీసీఐ) అధికారులు పనిచేయాలన్నారు. అక్టోబరు నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇదివరకు 110 ఉండగా, ఇప్పుడు 122కు పెంచినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ఏఎంసీ కేంద్రా న్ని కూడా ఈ జాబితాలో చేర్చాలన్నారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎమ్మెస్పీ చెల్లింపులు ఆధార్ ధ్రువీకరణ తర్వాతే చేయాలన్నారు. సీసీఐ ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్’ ద్వారా రైతులు స్వయంగా స్లాట్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. కౌలు రైతులకు కూడా ఓటీపీ ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ విధానంతో అర్హులైన ప్రతి పత్తి రైతుకూ మద్దతు ధర అందుతుందని చెప్పా రు. పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి సీసీఐ కేంద్రంలో స్థానిక పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. రైతుల ఫిర్యాదుల పరిష్కా రం కోసం టోల్ ఫ్రీ నంబరు 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. రోజువారీ క్రయవిక్రయాల పరిశీలనకు డైరెక్టరేట్‌లో కమాండ్ కంట్రో ల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోలు పారదర్శకంగా, వేగంగా జరిగేలా సీసీఐ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పత్తి సేకరణలో రాష్ట్రప్రభుత్వ సహకారం అవసరమని సీసీఐ ప్రతినిధులు చెప్పారు.