Share News

kumaram bheem asifabad- ప్రభుత్వ తీరుతో పత్తి రైతులకు ఇబ్బందులు

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:59 PM

కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి పంట కొనుగోలుపై రానున్న రోజుల్లో ప్రభావం పడనుందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవి కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- ప్రభుత్వ తీరుతో పత్తి రైతులకు ఇబ్బందులు
: మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి పంట కొనుగోలుపై రానున్న రోజుల్లో ప్రభావం పడనుందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవి కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తిపంటపై ఉన్న 11 శాతం టారీఫ్‌ను సున్నాకు తేవడంతో దేశంలోని పత్తిరైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చే పదివేల కోట్ల పత్తి దేశానికి చేరే ప్రమాదం ఉందన్నారు. దీంతో దేశంలోని పంట ధర తగ్గుతుందన్నారు. పెట్టుబడి దారి దేశాలకు సహకరించే విధంగా పీఎం మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారదీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధాఆన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అన్నారు. వెంటనే సర్వేనిర్వహించి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు రవి, మల్లేష్‌, జిల్లా కమిటీ సభ్యుడు దినకర్‌, కార్తిక్‌, రాజేందర్‌, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 10:59 PM