Share News

విద్యార్థులకే నేరుగా కాస్మొటిక్‌ చార్జీలు

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:26 AM

ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు అందించే కాస్మొటిక్‌ చార్జీ లు ఇకపై నేరుగా వారికే అందనున్నాయి.

  విద్యార్థులకే నేరుగా కాస్మొటిక్‌ చార్జీలు
నార్కట్‌పల్లిలోని బీసీ హాస్టల్‌ భవనం

విద్యార్థులకే నేరుగా కాస్మొటిక్‌ చార్జీలు

బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న హాస్టల్‌ విద్యార్థులు

దుర్వినియోగం ఉండదనే సర్కారు అభిప్రాయం

నార్కట్‌పల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు అందించే కాస్మొటిక్‌ చార్జీ లు ఇకపై నేరుగా వారికే అందనున్నాయి. హాస్టల్‌ వి ద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు చెల్లించేందుకు ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానంలో సాంఘిక సం క్షేమశాఖ ఉన్నతాధికారులు మార్పులు ప్రవేశపెట్టా రు. కాస్మొటిక్‌ చార్జీలను నేరుగా విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలోనే వేయాలని నిర్ణయించారు. దీం తో జిల్లాలోని హాస్టల్‌ విద్యార్థులందరూ బ్యాంకుల్లో ఖాతాలను తెరిచే పనిలో ఉన్నారు. విద్యార్థులకు అందజేసే కాస్మొటిక్‌ చార్జీల చెల్లింపులో గతంలో కొంత దుర్వినియోగమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సరికొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు.

గతంలో హాస్టల్‌ వార్డెనల ద్వారా

హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతీ నె లా కాస్మొటిక్‌ చార్జీలు చెల్లిస్తుంది. తరగతులను బట్టి ఈ చార్జీలు ఉన్నాయి. వీటితో సబ్బులు, కొబ్బరినూనె, పెన్నులు తదితర వస్తువులను విద్యార్థులు కొనుగోలు చేసేవారు. గత విద్యా సంవత్సరం వరకై తే బాలికలకు 3వ తరగతి నుంచి 7వ తరగతి వర కు ఒక్కో విద్యార్థికి రూ.55లు ఆపైన 10వ తరగతి వరకు రూ.75ల చొప్పున కాస్మొటిక్‌ చార్జీలు చెల్లించేది. అదేవిధంగా బాలురకైతే 3వ తరగతి నుండి 10 తరగతి వరకు క్షవరం చార్జీలు కలుపుకొని ఒక్కొక్కరికి రూ.62లు కాస్మొటిక్‌ చార్జీలు చెల్లించేది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాలికలకు 3 నుంచి 7 తరగతుల వారికి రూ.175, 8వ నుంచి 10వ తరగతి వరకు రూ.275లు పెంచింది. అదేవిధంగా బాలురకైతే 3 నుంచి 7వ తరగతి వరకు రూ.150, 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.200లు పెంచింది. అయితే ఈ డబ్బులను హాస్టల్‌ ఖాతాలో ప్రభుత్వం జమచేయగా వార్డెన్లు డ్రా చేసి విద్యార్థులకు అందజేసేవారు.

పారదర్శకత కోసమే

కాస్మొటిక్‌ చార్జీల చెల్లింపు విధానంలో మార్పు కేవలం పారదర్శకత కోసమేనన్న అభిప్రాయం వినపడుతోంది. గతంలో హాస్టల్‌ ఖాతాలో ప్రభుత్వం విద్యార్థులకు జమచేసే కాస్మొటిక్‌ చార్జీలను కొందరు వార్డెన్లు విద్యార్థులకు ఇవ్వకుండా చేతివాటానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకే నేరుగా వీటిని జమచేసే విధానం అమల్లోకి వస్తే పారదర్శకత ఉంటుందని, ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది.

బ్యాంకులో జమ చేయడాన్ని స్వాగతిస్తాం

కాస్మొటిక్‌ చార్జీలను వి ద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్ర భుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాన్ని స్వాగతిస్తాం. ఇ ది ఎంతో పారదర్శకమైన వి ధానం నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయడం శుభపరిణామం.

- పల్లగొర్ల మోదీ రాందేవ్‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఖాతాలు తెరవాలని సూచించాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్‌ విద్యార్థుల కాస్మొటిక్‌ చార్జీల చెల్లింపు కోసం బ్యాంకు ల్లో వ్యక్తిగత ఖాతాలు తెరవాలని సూచిస్తున్నాం. ఏ బ్యాంకులోనైనా ఖాతాలు తెరిచేలా వెసులుబాటు ఉంది. ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే కాస్మొటి క్‌ చార్జీలు జమ చేయబడతాయి. విద్యార్థులు బ్యాంకు ఖాతాలు ఇవ్వగానే పై అధికారులకు సమర్పిస్తాం.

-రామకృష్ణ, బీసీ ప్రత్యేక హాస్టల్‌ వార్డెన, నార్కట్‌పల్లి

Updated Date - Jul 23 , 2025 | 12:26 AM