ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అవినీతి కుట్ర
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:43 PM
ప్రజల దృష్టిని మరల్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై అవినీతి కుట్రకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజల దృష్టిని మరల్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై అవినీతి కుట్రకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ని వాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హ రీష్‌రావులను బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నార ని, ఒకే బ్యారేజీకి రెండు పగుళ్లు వస్తే బ్యారేజీ కూలి పోయినట్లుగా ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చే స్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన నాలుగు డిక్లరేషన్‌లను అమలు చేయక, ఇచ్చిన హామీలను అ మలు చేయలేక కొత్త డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. కావాలని కేసీఆర్‌పై కక్ష సా ధింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నాడన్నారు. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరంపై బద్నాం చేస్తున్న రేవం త్‌రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కట్టిన మిగితా ప్రాజెక్టులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పాత గురువు చంద్రబాబునాయుడు, కొత్త గురువు అ యిన ప్రధాని మోదీకి గురుదక్షణకు 465 టీఎంసీల నీ టిని దారాదత్తం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పథకం రచించారన్నారు. రాష్ట్రంతో పేగుబంధం లేని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతం మరింత కృషి చేయాలని, ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దివా కర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మం డలంలో నిరసన కార్యక్రమాలను చేపడతామని, కాళేశ్వ రం అవినీతికి గురైతే నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మేధావులు సమర్ధించే వారు కాదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు మానుకుని ప్రజా సంక్షే మానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో న స్పూర్, మంచిర్యాల అధ్యక్షులు గాదె సత్యం, సుబ్బన్న, రాజారమేష్, పెంట రాజయ్య, సరోజ, ప్రభాకర్, సురేం దర్‌రెడ్డి, తిరుపతి, నరేష్, రాజు, రాజేశం, భీమయ్య పాల్గొన్నారు.