Share News

అవినీతి పార్టీలను బొందపెట్టాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:22 PM

రాష్ట్రాన్ని అ వినీతిమయం చేసిన పార్టీలను రెండు పార్టీలను బొందపెట్టా లని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

అవినీతి పార్టీలను బొందపెట్టాలి
బీజేపీలో చేరిన లింగాల మండల కాంగ్రెస్‌ నాయకుడు రాజు

- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేటటౌన్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని అ వినీతిమయం చేసిన పార్టీలను రెండు పార్టీలను బొందపెట్టా లని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి రాజుతో కలిసి పాల్గొని మా ట్లాడారు. గ్రామాల్లో బీజేపీని గెలిపించుకు నేందుకు యువత ఉత్సాహంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయా లన్నారు. అనంతరం లింగాల మండల పరిధిలో ని రాయవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ మండల నాయకుడు ఉల్లంకొండ రాజుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు బిజేపి పార్టీలో చేరా రు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం అహ్వాన కమిటీ బోర్డు సభ్యుడు కట్ట సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయ కుడు మంగ్యానాయక్‌, నాయకులు రామకృ ష్ణారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:22 PM