kumaram bheem asifabad- మూల మలుపులు.. తరచూ ప్రమాదాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:23 PM
ఏజెన్సీల మండలాల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రాహదారుల్లో ఉన్న మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతు న్నాయి. దీంతో పాటు పిచ్చి మొక్కలు, పొదలు, విపరీతంగా పెరిగిపోయి దారులను కమ్మేస్తుండడం తో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి.
- రాకపోకలకు వాహనదారుల అవస్థలు
జైనూర్/సిర్పూర్(యు)/లింగాపూర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీల మండలాల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రాహదారుల్లో ఉన్న మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతు న్నాయి. దీంతో పాటు పిచ్చి మొక్కలు, పొదలు, విపరీతంగా పెరిగిపోయి దారులను కమ్మేస్తుండడం తో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి హెచ్చరిక బో ర్డులు, సూచికలు లేకపోవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొని గాయపడుతున్నారు. మలుపు ల కారణంగా దగ్గరికి వచ్చే వరకు వాహనాలు ఒక దానికొకటి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా యని, ఇరు వైపులా పొదలు కూడా కారణమని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సంబంఽ దిత అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ముళ్ల పొదలను తొలగించాలని కోరుతున్నారు.
- సిర్పూర్(యు) మండలంలో..
సిర్పూర్(యు) మండలంలో పాములవాడ నుం చి బాండియ్యేర్ వరకు వెళ్లే మార్గంలో కొద్దిగూడ గ్రామ శివారులో, సిర్పూర్(యు) మండల కేంద్రం నుంచి దేవుడ్ పెల్లి మార్గంలో పంగిడి నుంచి పెద్దదోబ వెళ్లే క్రమంలో కాకడ్ బొడ్డి సమీపంలో, సేవాదాస్ నగర్ గ్రామ సమీపంలో ఉన్న మలుపు వద్ద గత ఏడాది ఓ యువకుడు మృత్యు వాత పడ్డాడు. జైనూరు మండలంలో జామ్ని నుంచి పంగిడి వెళ్లే క్రమంలో పొలాస తండా వద్ద, ఉషే గాం నుంచి పట్నాపూర్, జండా గూడ గ్రామాల మార్గంలో.. అంద్‌గూడ నుంచి కెరమెరి మండలం లోని మలంగీ గ్రామానికి వెళ్లే మార్గంలో.. లింగా పూర్ మండల కేంద్ర నుంచి లొద్దిగూడ మీదుగా తిర్యాణి వెళ్లే మార్గంలో.. గోపాల్‌పూర్, రామునా యక్ తండా, ఫూల్‌సింగ్‌నాయక్ గ్రామాల సమీపం లో ఉన్న మలుపులు, ఇదే మండలంలోని జామూ లధర నుంచి మారుగూడ వెళ్లే మార్గంలో మూడు మలుపులు ఉన్నాయి. మామిడిపెల్లి నుంచి పిక్లా తండా వెళ్లే మార్గంలో.. మండల కేంద్రంలో కస్తూ ర్బా పాఠశాల సమీపంలో, భుసిమెట్ట క్యాంప్ ఘాట్ అటవీ మార్గాన కెరమెరి వైపు వెళ్లే మార్గంలో సుమారు పదికి పైగా మూలమలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- ఎస్సీ వసతి గృహం ఎదురుగా..
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేం ద్రం నుంచి ధాబా వెళ్లె రహదారిపై ఎస్సీ వసతి గృహం ఎదురుగా ఉన్న మూల మలుపుతో పాటు ఖమన గ్రామ సమీపంలో గల మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాంకిడి మండల కేం ద్రం నుంచి సవ్వాతి, ధాబా, నవేధరి, చిచ్‌పల్లి, బండకాసా, డొడ్డిగుడ, తదితర గ్రామాలకు వాహన దారులు పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తుం టారు. ఎస్సీ వసతి గృహం ఎదురుగా ఉన్న మూల మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించ కపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. మూల మలుపుల వద్ద చెట్ల కొమ్ములు వాలి ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, ప్రజలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఖమన గ్రామ సమీపంలో ఉన్న మూల మలుపులు సైతం ప్రమా దాలకు నిలయంగా మారాయి. వాంకిడి మండలంలోని వివిద గ్రామాల నుంచి ప్రజలు ఈ రోడ్డు ద్వారానే కాగజ్‌నగర్‌కు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటారు. మూల మలుపుల వద్ద ఏలాంటి ప్రమాద సూచిక బోర్డోలు ఏర్పాటు చేయకపోవడం తో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. గత ఏడాది ఖమన నుంచి కాగజ్ నగర్ వరకు బిటీ రోడ్డును నిర్మించిన సదరు కాంట్రాక్లర్ మూలమలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.