మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:59 PM
జిల్లాలో మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాలను త క్షణమే ప్రారంభించాలని రైతు సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసులు డిమాండ్ చేశారు
- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసులు
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాలను త క్షణమే ప్రారంభించాలని రైతు సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రైతు సంఘం కార్యాలయం లో ఆ సంఘం ముఖ్య నాయకుల స మావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జిల్లాలో మొక్క జొన్న సాగు అధికంగా సాగు చేశారని, పంట దిగుబడి వచ్చినా నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ము కుంటు న్నారని పేర్కొన్నారు. మొక్కజొన్నకు కొనుగో లు ధర రూ.2400 ఉండగా ప్రైవేటు వ్యాపా రులు రూ.1800 నుంచి రూ.2వేల వరకు మా త్రమే కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతు న్నారని ఆరోపించారు. ప్రభుత్వం మార్క్‌పెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రైవేటు వ్యాపారుల దోపిడీని అరికట్టాలని డి మాండ్ చేశారు. అలాగే సీసీఐ ద్వారా పత్తి కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్ద తు ధరను రూ.10,075కు కొనుగోలు చేయాల ని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చిన కపాక్ కిసాన్ యాప్‌లో రైతులు తమ పేరును నమోదు చేసుకుంటేనే పత్తిని కొనుగో లు చేస్తున్నారని, స్మార్ట్ లేపోవడం, ఉన్నా సిగ్న ల్ సమస్య కారణంగా రైతులు అందులో పేర్ల ను నమోదు చేసుకోలేకపోతున్నారన్నారు. కా ర్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేశ్యానాయక్, జిల్లా సహాయ కార్యదర్శి నాగరా జుగౌడ్, నాయకులు బాలరాజు, వి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.