Share News

kumaram bheem asifabad- నేరాల నియంత్రణకు కార్డన్‌సెర్చ్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 10:35 PM

నేరాల నియంత్రణకు కార్డన్‌సెర్చ్‌ చేపట్టినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కెరమెరి, ఆసిఫాబాద్‌ ఎస్సైలతో కలిసి ఆదివారం గోయగాం గ్రామంలో కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు.

kumaram bheem asifabad- నేరాల నియంత్రణకు కార్డన్‌సెర్చ్‌
గోయగాంలో మాట్లాడుతున్న సీఐ సత్యనారాయణ

కెరమెరి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు కార్డన్‌సెర్చ్‌ చేపట్టినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కెరమెరి, ఆసిఫాబాద్‌ ఎస్సైలతో కలిసి ఆదివారం గోయగాం గ్రామంలో కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ద్విచక్ర వాహనాలకు సరైన పత్రాలు లేని వాటిని గుర్తించి జరిమానా విధించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్‌ క్రైమ్‌, 100 డయల్‌, గంజాయి, బెట్టింగ్‌ యాప్‌ తదితరాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, వాడకంపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సై మధుకర్‌, సతీష్‌, గ్రామస్తులు శంకర్‌, బాపూజీ, శంకర్‌, ఆదిల్‌, సురేష్‌, సునీల్‌గౌడ్‌, మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రవిచంద్ర కాలనీలో ఆదివారం జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో సోదాలు నిర్వహించి 50 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్‌ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, ప్రజలతో కలిసి పోవడానికి కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం చేపడుతున్నామన్నారు. ప్రజలు భయ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలపారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వయక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లపై స్పందించవద్దని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం వీర్దండి గ్రామంలో ఆదివారం సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇళ్లను సోదాలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. అనంతరం గ్రామస్థులకు సైబర్‌క్రైం, గంజాయి, ట్రాఫిక్‌ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయ్‌, ప్రవీణ్‌, నరేష్‌, కమలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 10:35 PM