గజగజ..
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:38 PM
జిల్లాలో గత మూడు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఈ యేడు ఇప్పటి వరకు లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బ యటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యం గా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నా యి.
-మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
-ఉదయం, సాయంత్రం వేళల్లో అధికమవుతున్న చలి
-ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
-పొగమంచు కారణంగా వాహనదారుల ఇక్కట్లు
మంచిర్యాల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత మూడు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఈ యేడు ఇప్పటి వరకు లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బ యటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యం గా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నా యి. పగటి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు జరగడంతో వాతావరణం చల్లబడుతోంది. ఉదయం 9 గంటల వర కు కూడా చలి ప్రభావం ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. తుఫాన్ కారణంగా శీతల గా లుల వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ప డుతున్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గా లుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉంటోంది.
ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు....
ఒకేసారి చలి తీవ్రత పెరగడంతో ముఖ్యంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పం చాయతీ కార్యదర్శులు, ఉదయం షిఫ్ట్‌కు వెళ్లే సింగరేణి కార్మికులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులపైనా చలి ప్రభావం అధికంగా ఉంటోంది. విపరీతమైన చలి కారణంగా సింగరేణిలో కార్మికుల హాజరు శాతంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నా యి. పాలు, కూరగాయల వ్యాపారులు తెల్లవా రుజా మున ఐదు గంటలకే బయటకు వెళ్లాల్సి రావడం తో చలి కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లపైకి జనాలు వచ్చేం దుకు సాహసించడం లేదు.
పొగమంచుతో వాహన చోదకుల ఇబ్బందులు....
విపరీతమైన చలికి తోడు పొగమంచు కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండటంతో ఉదయం స మయంలో కూడా లైట్ల వెలుతురులో వాహనాలను న డపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ఆయా ఏరి యాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రి వేళల్లో అధికంగా కురుస్తున్న మంచు కారణంగా చలికి వణికి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఏడు న్నర గంటలు దాటితే తప్ప....సూర్యుడు ఉదయించడం లేదు.
జిల్లాలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు...
జిల్లాలో సోమవారం 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేమనపల్లి మండలం నీల్వాయిలో 20.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కోట పల్లి మండలంలో 20.9 డిగ్రీలు, కన్నెపల్లి మండలంలో 21.4 డిగ్రీలు, చెన్నూరు మండలంలో 21.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.