Share News

అంటువ్యాధులపై నిరంతరం నిఘా

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:05 PM

అంటువ్యాధులపై నిరంతరం నిఘా ఉండాలని, ప్రైవేట్‌ క్లినిక్‌, నర్సింగ్‌హోం, హాస్పిటళ్లు, డయా గ్నోస్టిక్‌ సెంటర్లలో అతి ముఖ్యమైన 35 రకాల అంటు వ్యాధులను గుర్తించి ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌ పోర్టల్‌లో ఎంట్రీ చేయా లని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే.రవికుమార్‌ ప్రైవేట్‌ ఫెసిలిటీ డాక్టర్లకు సూచించారు.

అంటువ్యాధులపై నిరంతరం నిఘా
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే రవికుమార్‌

- డీఎంహెచ్‌వో రవికుమార్‌

కందనూలు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : అంటువ్యాధులపై నిరంతరం నిఘా ఉండాలని, ప్రైవేట్‌ క్లినిక్‌, నర్సింగ్‌హోం, హాస్పిటళ్లు, డయా గ్నోస్టిక్‌ సెంటర్లలో అతి ముఖ్యమైన 35 రకాల అంటు వ్యాధులను గుర్తించి ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌ పోర్టల్‌లో ఎంట్రీ చేయా లని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే.రవికుమార్‌ ప్రైవేట్‌ ఫెసిలిటీ డాక్టర్లకు సూచించారు. శుక్రవారం నా గర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌లో మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్‌ క్లినిక్‌, హాస్పిటళ్లు, నర్సింగ్‌హోమ్‌లు, డయాగ్నోస్టిక్‌ సెం టర్ల నిర్వాహకులకు ఐహెచ్‌ఐపీ పో ర్టల్‌లో అంటువ్యాధుల వివరాలను ఎలా ఎంట్రీ చేయాలో శిక్షణనిచ్చారు. అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలను, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవ శ్యకతను వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ప్రదీప్‌, ఎపిడమాలజిస్టు డాక్టర్‌ ప్రవళ్లిక, జిల్లా ఉప మాస్‌ మీడియా అధికారి రాజగోపాలాచారి, డీడీఎం నవీ, ఎంపీహెచ్‌ఈవో కొట్ర నిరంజన్‌, వివిధ ప్రైవేట్‌ ఆరోగ్యకేంద్రాల డయగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఆధునిక ల్యాబ్‌ సేవల సౌకర్యానికి కృషి

కందనూలు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుప త్రిలో ప్రస్తుత జనాభాకనుగుణంగా అవసరమై న ఆధునిక ల్యాబ్‌ సేవల సౌకర్యం, రోగులకు మెరుగైన చికిత్సకు ఆధునిక అత్యవసర బెడ్‌ల సంఖ్యలను పెంచేందుకు నిర్ణయించామని ప్రభు త్వ సాధారణ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ వి.శేఖర్‌ తెలిపారు. శుక్రవారం బ యోకెమెస్ట్రీ, మైక్రోబయాలజీ, పాతలజీ డిపార్ట్‌ మెంట్‌ విభాగాధిపతులతో సమావేశం నిర్వహిం చారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు డాక్టర్‌ వహేదా, డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ గణేష్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, సివిల్‌సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ రవిశంకర్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ రోహిత్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:05 PM