Nagaram Land Case: నాగారం భూముల కేసులో ఐఏఎస్, ఐపీఎస్‌లకు కోర్టు ధిక్కరణ నోటీసులు
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:02 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూదాన్, ప్రభుత్వ భూముల కేసులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూదాన్, ప్రభుత్వ భూముల కేసులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. ఈ భూముల విషయమై తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డికి హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఆ భూముల స్వరూపాన్ని మార్చరాదని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం నోటీసులు జారీచేసింది. పిటిషనర్ బిర్ల మల్లేశ్ తాజాగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసి తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.