TG Govt: కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించండి
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:00 AM
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అవసరమైన చోట్ల కోర్టు భవనాలు నిర్మించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్
సిబ్బందిని నియమించండిహైకోర్టు సీజే జస్టిస్
అపరేష్ కుమార్‌సింగ్ సీజేతో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అవసరమైన చోట్ల కోర్టు భవనాలు నిర్మించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీజేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సీజే సూచించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ ప్రతిపాదనల్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ వివరించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, జస్టిస్ పి.సామ్ కోశి, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి పాల్గొన్నారు.