Share News

వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:17 AM

చౌటుప్పల్‌ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తిచేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.

వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలి
చౌటుప్పల్‌లో వంద పడకల ఆస్పత్రి పనులు పరిశీలిస్తున్న డీవైఎఫ్‌ఐ నాయకులు

చౌటుప్పల్‌ టౌన్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తిచేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో రూ.38కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రి పనులను ఆదివారం పరిశీలించారు. ఆస్పత్రి పనులు తుదిదఽశకు వచ్చాయని, ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. జాతీ య రహదారి వెంట ఉన్న ఈ ఆసుపత్రి రోడ్డు ప్రమాద బాధితులతో పాటు పేదలకు ఉపయోగపడుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రి మంజూరు చేసిందని, ఈ ఆసుపత్రి నిర్మా ణానికి 2023 ఏప్రిల్‌ 18న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు ఖయ్యూమ్‌, మల్లేశ్‌, యానాల రాజశేఖర్‌రెడ్డి, శంకర్‌, సప్పిడి హరీష్‌రెడ్డి, లింగారెడ్డి, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:17 AM