Share News

‘ఉపాధి’ పథకాన్ని ఎత్తివేసే కుట్ర : వ్యకాస

ABN , Publish Date - May 29 , 2025 | 01:02 AM

కార్మిక సంఘాల ఐక్య పోరాటాలతో సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేయడానికి కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ అయిలయ్య ఆరోపించారు.

 ‘ఉపాధి’ పథకాన్ని ఎత్తివేసే కుట్ర : వ్యకాస
సమావేశంలో మాట్లాడుతున్న నారీ అయిలయ్య

‘ఉపాధి’ పథకాన్ని ఎత్తివేసే కుట్ర : వ్యకాస

చిట్యాల, మే 28(ఆంధ్రజ్యోతి): కార్మిక సంఘాల ఐక్య పోరాటాలతో సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేయడానికి కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ అయిలయ్య ఆరోపించారు. చిట్యాలలో బుధవారం ని ర్వహించిన సమావేశంతో ఆయన మాట్లాడారు. క్ర మంగా నిధులు తగ్గిస్తూ, కూలీలకు పనిముట్లు ఇవ్వకుండా ఉపాధి పథకాన్ని ని ర్వీర్యం చేస్తోందిని విమర్శించారు. కూలీలకు పని ప్రదేశంలో వసతులు కల్పించడం లేదని, కూలి సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చే యాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొ జ్జ చినవెంకులు, ఉపాధ్యక్షుడు కత్తుల లింగస్వామి, కల్లూరు కమారస్వామి, గుడిసె లక్ష్మీనారాయణ, మె ట్లు పరమేశం, రాములు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాకు కార్మికులు తరలిరావాలి

కేతేపల్లి: కేంద్రప్రభుత్వంతో పోరాడి సాధించుకు న్న ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాకు కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని వ్య కాస జిల్లా అధ్యక్షుడు బొజ్జ చినవెంకులు కోరారు. మండలకేంద్రం కేతేపల్లిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ధర్నా పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు ఉద్యమించి ఉ పాధి చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్‌.లూర్దుమారయ్య, నాయకులు వి. వెంకన్న, ఎ.నాగయ్య, టి.డానియేలు, బి. ప్రవర్దన్‌, జ యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 02:56 PM