Share News

కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రారంభించకుండా కుట్ర

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:27 PM

చంద్రబాబు శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించకుండా గోదావరిలో మిగులు జలాలు ఉండేలా చూస్తున్నారని, ఆ సాకుతో ఆంధ్ర సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు కట్టుకునేందుకు సహకరిస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించా రు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రారంభించకుండా కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

మోత్కూరు, జూలై30(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించకుండా గోదావరిలో మిగులు జలాలు ఉండేలా చూస్తున్నారని, ఆ సాకుతో ఆంధ్ర సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు కట్టుకునేందుకు సహకరిస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించా రు. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్‌ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం జరిగిన కార్యకర్తల సమా వేశం లో మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రారంభిస్తే తెలంగాణలో 50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బనకచర్ల ప్రా జెక్టును చంద్రబాబు కట్టలేరన్నారు. కేవలం రెండు పిల్లర్లు ఒక్క అడుగు కుంగాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిం పకుండా 5లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా వదిలేస్తు న్నారన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 17మోటార్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆంధ్ర ప్రాంతవాసులు పోచంపాడు వద్ద చేసిన మోసానికి బదులు తీర్చుకోవడానికే మాజీ సీఎం కేసీఆర్‌ నీరు లభించే చోట ప్రాజెక్టు నిర్మించాలని భావించి 140 టీఎంసీల నీటి నిల్వ సామర్యంతో 240టీఎంసీల నీటిని వాడుకునేలా కాళేశ్వరం నిర్మిస్తున్నామని చెప్పి నాలుగైదు వందల టీఎంసీల నీటిని వాడుకునేలా ప్లాన్‌ చేశారన్నారు. దాన్ని వినియోగించుకోవడం చేతకాక ప్రస్తుత సీఎం రేవం త్‌రెడ్డి ఆంధ్రకు సహకరించేలా కుట్ర చేస్తున్నారని విమర్శిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా తెలంగాణలో నీరు ఎలా పారేది జగదీష్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివ రించారు. తిరుమలగిరి సభలో తాను మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఎందుకు తీసుకరాలేదని సీఎం ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ తనతో ఎవరొస్తారో రండి ఎస్సారెస్పీ కాల్వల చివరి ఊరి అయిన చినసీతారాం తండాకు వెళుదాం రావాలని, అక్కడ కూడా చివరి రైతు వద్దకు వెళ్లి అడుగుదాం, బీఆర్‌ఎస్‌ హయాంలో నీళ్లు వచ్చాయో లేదో, వచ్చాయంటే ఆ రైతు చేత మీరు(తన సవాల్‌ స్వీకరించి వచ్చిన వారు) చెప్పుతో కొట్టించుకోవాలి, రాలేదంటే నేను కొట్టించుకుంటానని సవాల్‌ విసిరారు.

కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాదే : గాదరి

తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న పదేళ్లు ఎవరిపైనా కేసు పెట్టలేదని, అభివృద్దే లక్ష్యంగా పని చేశామన్నారు. ఎమ్మెల్యే సామేలు, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వగ్రామాల్లో ఏ ఊరికైనా వెళ్దాం.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ అయ్యిందా అని అడుగుదాం అని నేను సవాల్‌ చేస్తే ఆ సవాల్‌ను స్వీకరించకుండా తానేదో సభను అడ్డుకుంటా నన్నట్టుగా తప్పుడు ప్రచారం చేసి తనను హౌస్‌ అరెస్టు చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు ఐదారేళ్లు ఎస్సారెస్సీ కాల్వల ద్వారా నీరందిస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాల్వలను ఎండబెట్టిందన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ ఇన్‌చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నెబోయిన రమేష్‌, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, శ్రీరాముల జ్యోతిఅయోధ్య, చిప్పలపల్లి మహేందర్‌ పాల్గొన్నారు. మోత్కూరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఎండీ. అమీర్‌, మహేశ్వరం హనుమంతు, నల్లబోతు వెంకట్‌ తదితరులు మాజీమంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశం ముగిసిన తర్వాత కార్యకర్తలంతా భోజనానికి వెళ్లగా, ఇదే అదునుగా జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించి కార్యకర్తల జేబుల్లోంచి డబ్బులు కాజేశారు.

Updated Date - Jul 30 , 2025 | 11:27 PM